మహిళా మంత్రిని కించపరిచిన కేసులో ఎమ్మెల్సీ రవి అరెస్ట్
ఎమ్మెల్సీ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు
శాసన మండలి హలులో బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్ పై కించపరిచే పదాన్ని ఉపయోగించారనే నేపథ్యంలో ఆయనను బెలగావిలోని సువర్ణ విధాన సౌధ ప్రాంగణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ఊహించిన పోలీసులు ఆయనను వేరే ప్రాంతానికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం, ఇక్కడి హిరేబాగేవాడి పోలీస్ స్టేషన్‌లోని భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 75 (లైంగిక వేధింపులు), 79 (ఒక మహిళ అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేసిన తర్వాత, రవిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారణ చేస్తున్నారు. అయితే భద్రత దృష్ట్యా రవిని ఖానాపురా పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో హీరేబాగేవాడి పోలీస్‌స్టేషన్ వద్ద భారీగా జనం గుమిగూడారు.
" ఖానాపురాలో కూడా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు గుమిగూడి గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. అదనంగా ఆ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చే అవకాశం కూడా ఉంది, ఈ కారణాలన్నీ కూడా ప్రజా శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉంది," పోలీసులు పేర్కొన్నారు.
రవి భద్రతను దృష్టిలో ఉంచుకుని రామదుర్గకు తరలించినట్లు తెలిపారు. " అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మీడియా, ఇతర వ్యక్తులు కాన్వాయ్‌ను అనుసరించారు. రవి భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎస్కార్ట్ ను ఫాలో అవుతున్న వారి నుంచి తప్పించుకోవడానికి చర్యలు తీసుకుంది.
ఈ ప్రక్రియ మొత్తంలో, రవికి ఆహారం, వైద్య సేవలతో సహా అన్ని సౌకర్యాలు అందిచామని చెప్పారు. తరువాత కోర్టులో హాజరుపరిచారు’’ అని పోలీసులు తెలిపారు. పోలీసులు మానవ హక్కులు ఉల్లంఘించారని, రాత్రంతా ఆయనను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రౌండ్స్ పై తీసుకెళ్లారని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఎవరి ఆదేశాలతో పని చేస్తున్నారని మాకు తెలుసని, ఇది నియంతృత్వం అని తెలిపారు.
Next Story