
మోదీ ‘మన్ కీ బాత్’లో IISc మ్యూజిక్ స్కూల్..
ప్రఖ్యాత IISc పరిశోధనా కేంద్రం లోపల, సైన్స్‌తో పాటు సంగీతం పాఠాలు కూడా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తన “మన్ కీ బాత్”(Mann Ki Baat) ప్రసంగంలో సంగీతం, ఏకాగ్రతపై మాట్లాడిని కొన్న మాటలతో..అందరి దృష్టి బెంగళూరు(Bengaluru)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) లోని ఒక చిన్న సంగీత పాఠశాలపై పడింది.
పాతికేళ్లుగా..
IISc కళాశాల దశాబ్దాలుగా పరిశోధన, గణిత, సైన్స్‌కు పేరుగాంచిందన్న విషయం అందరికీ తెలుసు. అయితే చాలామందికి తెలియని విషయం మరొకటి ఉంది. క్యాంపస్‌లో ఓ చిన్నగదిలో సంగీత(Music) పాఠశాల ఉంది. 25 ఏళ్లుగా మ్యూజిక్ టీచర్ గీతా ఆనంద్ ఈ పాఠశాల నడుపుతున్నారు. ఇక్కడ సంగీతం నేర్చుకోడానికి చిన్నారులే కాకుండా.. సైన్స్ పరిశోధకులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, గృహిణులు కూడా వస్తుంటారని చెప్పారు. రోజంతా పని చేసిన తర్వాత సంగీత సాధన చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది. సంగీతం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందంటారు.
సైన్స్‌కి సంబంధించిన వారికి సంగీతం ఒక అభిరుచి మాత్రమే కాక.. దృష్టిని మెరుగుపరచే సాధన. గృహిణులకు ప్రశాంతత, విద్యార్థులకు ఏకాగ్రతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గీతా ఆనంద్ పాఠాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ సంగీతం నేర్పుతారు.
"ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నా.. సంగీత పాఠాలు మరోవైపు వినిపిస్తాయి. సంగీతం, సైన్స్ కలయిక మనస్సును స్థిరంగా ఉంచే కొత్త మార్గం. ‘‘నేను విద్యార్థులకు ఇదే చెబుతాను. వేదికపైకి రండి, ఆనందంగా పాడండి. ఇక్కడ అహంకారం, రాజకీయాలు లేవు. సంగీతం, ఆనందం మాత్రమే," అని ముగించారు మ్యూజిక్ టీచర్ గీతా ఆనంద్.

