పేరుకు పేద జిల్లా కానీ విద్యలో మాత్రం సంచలన ఫలితాలు
x
వరుసలో నిల్చున్న విద్యార్థినులు

పేరుకు పేద జిల్లా కానీ విద్యలో మాత్రం సంచలన ఫలితాలు

విద్యలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న తమిళనాడులోని పెరియలూర్ జిల్లా


శ్వేతా త్రిపాఠి

తమిళనాడులోని అరియలూర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన జిల్లాగా పేరుంది. కానీ గతకొంత కాలంగా ఇక్కడ విద్యా కుసుమాలు విరుస్తున్నాయి. మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక శాతంలో విద్యార్థుల ఇక్కడే అత్యధిక సంఖ్యలో పాస్ పర్సెంటీజీ సాధిస్తున్నారు.

2024-25 విద్యా సంవత్సరంలో 11,12 వ తరగతి పరీక్షలో రాష్ట్రంలోనే ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 2024 లో 12 తరగతి పరీక్షలో ఈ జిల్లా వ్యాప్తంగా 97.25 శాతం ఉత్తీర్ణత సాధించి మూడోస్థానంలో నిలిచిన ఈ అరియలూర్, ఈ సంవత్సరం మాత్రం 98.82 శాతం ఉత్తీర్ణతతో తన పనితీరును మెరుగుపరుచుకుని అగ్రస్థానం సాధించింది.

ఉపాధ్యాయుల అంకితభావం, స్థిరమైన ప్రయత్నాలు, బలహీన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో దృష్టి, పునశ్చరణ, విద్యార్థుల సమగ్ర అభివృద్దిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ ఫలితాలు సాధించింది.
వందశాతం ఉత్తీర్ణత సాధించిన 52 పాఠశాలలు
జిల్లాలో 92 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 56 ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అరియలూర్లో 12 తరగతి పరీక్షకు 8,533 విద్యార్థులు హజరయ్యారు. వీరిలో 29 ప్రభుత్వ పాఠశాలల నుంచి 8,432 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,304 మంది బాలికలు సైతం ఉన్నారు.
ఇంకా 92 పాఠశాలలో 53 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఇందులో 29 ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 98.32 ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయడంతో అరియలూర్ ఈ విభాగంలోనే రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది.
‘‘2015-16 లో జిల్లా ఉత్తీర్ణతలో 12 వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత మెల్లగా తన పనితీరును మెరుగుపరుచుకుంటూ 96.47 శాతం ఉత్తీర్ణత సాధించి టాప్ టెన్ లోకి ప్రవేశించింది. 2024 లో మూడో శాతానికి చేరుకున్నాం’’ అని అరియలూర్ లోని ముఖ్యవిద్యాధికారి కార్యాలయంలోని జిల్లా ఈసీఓ కో ఆర్డినేటర్ టీ సౌందరపాండియన్ అన్నారు.
చురుకైన ఉపాధ్యాయులు..
ఉపాధ్యాయుల కృషి, అంకితభావంతో అద్భుతమైన ఫలితాలు సాధ్యం అయ్యాయని ముఖ్య విద్యా అధికారి ఐ. శివనాథన్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి బాగా చదువుకున్నవారు కానందున, ట్యూటర్లు నాయకత్వం వహించారని అన్నారు.
పరీక్షలలో వెనకబడిన విద్యార్థుల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ ఉపాధ్యాయుల స్థిరమైన ప్రయత్నాల వల్లే మెరుగైన పనితీరు సాధ్యమైందని ఆయన అన్నారు.
12 వ తరగతి పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించామని ఆయన అన్నారు.
పరీక్షలు, అభ్యాస సామగ్రి..
ప్రత్యేక దృష్టి అవసరమయ్యే విద్యార్థులను గుర్తించడంతో పాటు, పాఠశాలల వారి పనితీరును మెరుగుపరచడానికి రోజువారీ వేగ పరీక్షలను కూడా నిర్వహిస్తాయి.
‘‘మేము ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల ప్రతిభ పై ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రత్యేకంగా మాట్లాడతాము. సిలబస్ లోని ముఖ్యమైన విభాగాలను విద్యార్థులకు గుర్తు పెట్టుకోవడానికి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాము. ’’ అని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు మురగేశన్ ది ఫెడరల్ తో అన్నారు.
విద్యార్థులు ముఖ్యమైన అంశాలను గ్రహించడంలో సహాయపడటానికి రూపొందించడబడిన సంక్షిప్త సిలబస్, విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందజేసినట్లు తెలిపారు.
‘‘కనీస అభ్యాస సామగ్రి పిల్లలు పరీక్షలో ఉత్తీర్ణలయ్యేలా చేస్తుంది. ఈ సారి మోడల్ పేపర్ నుంచి 45-50 మార్కులను కవర్ చేసింది. ప్రతి పాఠశాలకు ఐదు సెట్లు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం ప్రతి విద్యార్థి జనవరిలో ఈ సామాగ్రి అందుకున్నాడు’’ అని మురుగేశన్ చెప్పారు.
తల్లిదండ్రులను తరుచుగా సంప్రదించడం వలన విద్యార్థులు బాగా రాణించడంలో కీలక పాత్ర పోషించిందని మురుగేషన్ అంటున్నారు. ‘‘పిల్లల చదువులకు మద్దతు ఇవ్వడానికి డ్రాపౌట్స్ నివారించడానికి తల్లిదండ్రులను ప్రొత్సహించడానికి మేము ప్రతి నెల సమావేశాలు నిర్వహించాము’’ అని ఆయన చెప్పారు.
విద్యార్థుల క్రమం తప్పని హాజరు.. పర్యవేక్షణ
విద్యార్థులు పరీక్షలో ఉత్తమ ఫలితాలు పొందడానికి ఓ ప్రధాన కారణం.. క్రమంతప్పని హాజరు.
‘‘విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా మేము చూసుకుంటాము. ఇక్కడ హజరు చాలా బాగుంది. కనీసం 70 శాతంగా నమోదవుతూ ఉంది. పాఠశాల విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ సమన్వయంతో తరగతి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల హాజరను చురుగ్గా పర్యవేక్షిస్తోంది. ఏదైనా అక్రమాలు గమనించినట్లయితే దానిని పూర్తిగా దర్యాప్తు చేస్తారు’’ అని సౌందరపాండియన్ అన్నారు.
జిల్లా పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం, తగినంత సిబ్బంది వల్ల సమర్థవంతమైన పర్యవేక్షణను సులభం చేసిందని సౌంద్రపాండియన్ అన్నారు.
జిల్లాకు చెందిన మరో ఉపాధ్యాయుడు ఎస్ఎలాంచెజారన్ మాట్లాడుతూ.. ప్రధాన విద్యా అధికారి ప్రతి సబ్జెక్ట్ కు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు.
ఈ సమావేశాలు ప్రతి ఉపాధ్యాయుడితో ప్రత్యక్ష చర్చలతో స్కోర్ లను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. ప్రతి పాఠశాల వ్యూహాన్ని ఒకదాని తరువాత ఒకటిగా చర్చించి, ఇతర పాఠశాలలో కూడా విజయవంతమైన వ్యూహాలను అమలు చేస్తారు.
అంతేకాకుండా ప్రాథమిక పరీక్షల సమయంలో స్కోర్ లను మెరుగుపరచడానికి ఉన్న వాళ్లు, అవకాశాలను పరిశీలించడానికి ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు జరుగుతాయి.
జిల్లా విద్యాశాఖ అధికారి కూడా పాఠశాలలను నేరుగా తనిఖీ చేస్తారని ఎలాంచెరిజాన్ అన్నారు. కొన్ని సార్లు మేము విద్యార్థులను పాఠశాలల నుంచి బయటకు రాకుండా చూస్తామని, ఇంటి దగ్గర మెరుగైన వసతులు లేనివారికి అన్ని సౌకర్యాలు కల్పించి డ్రాపౌట్లు నివారించామని ఆయన చెప్పారు.
Read More
Next Story