‘బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా తిరిగి వస్తారు’
x

‘బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా తిరిగి వస్తారు’

బంగ్లాదేశ్‌‌ను వీడి భారత్‌కు చేరిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా.. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి తన దేశానికి వస్తారని ఆమె కుమారుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌ తెలిపారు.


బంగ్లాదేశ్‌‌ను వీడి భారత్‌లో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనా.. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి తన దేశానికి వస్తారని వ్యాపారవేత్త అయిన ఆమె కుమారుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌ తెలిపారు.

తన తల్లి బంగ్లాదేశ్‌కు తిరిగి రాదని తాను మొదట్లో చెప్పానని, కానీ ఇప్పుడు 76 ఏళ్ల హసీనా "రిటైర్డ్ లేదా యాక్టివ్" రాజకీయ నాయకురాలిగా తప్పకుండా తిరిగి వస్తుందని పీటీఐతో అన్నారు.

ప్రజలకు అండగా అవామీ లీగ్ ..

దివంగత షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబ సభ్యులు తమ ప్రజలను విడిచిపెట్టరని, అవామీ లీగ్‌ను వదిలిపెట్టరని తేల్చి చెప్పారు.

"అవును.మా అమ్మ బంగ్లాదేశ్‌కు తిరిగి రాదని నేనే చెప్పాను. కానీ గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా మా నాయకులు, పార్టీ కార్యకర్తలపై నిరంతర దాడుల తరువాత మేం వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాం." అని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో మరణాల సంఖ్య 470కి చేరుకోవడంతో అరాచక దేశంగా మారింది. రెండవ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతోంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత ఆమె ఖచ్చితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తుందని జాయ్ చెప్పారు .

హసీనా తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంగ్లాదేశ్‌ పారిపోయిందని వార్తలను సజీబ్‌ వాజెద్‌ జాయ్‌ ఖండించారు. హసీనా ఎందుకు ఢాకా వీడారన్న ప్రశ్నకు.."ఆమె దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. సెక్యూరిటీ బలగాలు ఆమెను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నివాసం వైపు వస్తున్న వందలాది మంది నిరసనకారుల మరణానికి కారణం కాకూడదు. అందుకే మా అమ్మను అక్కడి నుంచి పంపేందుకు ఏర్పాట్లు జరిగాయి’’ అని సమాధానమిచ్చారు. అవామీ లీగ్‌ను రాజకీయాల నుండి మినహాయిస్తే బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉండదని స్పష్టం చేశారు.

యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు..

హసీనా సోమవారం భారతదేశానికి వెళ్లింది. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆమెకు న్యూఢిల్లీలో ఆశ్రయం పొందారు. ఢాకా విడిచి వెళ్లే ముందు ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడనుంది.

తాజాగా ఎన్నికలు జరపాలి..

తాను ఐక్యతతో కూడిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానని, గతంలో చేసిన తప్పులు భవిష్యత్తును పునరావృతం కాకూడదని భావిస్తున్నానని జాయ్ చెప్పారు.యూనస్‌ను ఉటంకిస్తూ తాజాగా ఎన్నికలు జరపాలని కోరారు.

మోదీకి ధన్యవాదాలు..

తన తల్లిని కాపాడినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హసీనా కుమారుడు కృతజ్ఞతలు తెలిపాడు. "నేను మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని త్వరగా పునరుద్ధరించడానికి నాయకత్వం వహించాలి." అని కోరారు.

పాకిస్థాన్‌పై అనుమానం..

బంగ్లాదేశ్‌లో అశాంతికి పాకిస్థాన్‌ ఆజ్యం పోసిందని జాయ్ ఆరోపించారు. తన వద్ద విదేశీ జోక్యాన్ని సూచించే సాక్ష్యాధారాలు ఉన్నాయని, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రమేయం ఉందన్నారు.

CIA కూడా ప్రమేయం ఉందా? అని అడిగిన ప్రశ్నకు.."పాకిస్తాన్ ISI ప్రమేయం ఉందని నేను అనుమానిస్తున్నాను. సామాజిక మాధ్యమాల ద్వారా పరిస్థితిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరిగాయి. పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఏమి చేసినా.. వారు దానిని మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు" అని చెప్పారు.

హసీనా UK లేదా మరేదైనా దేశంలో ఆశ్రయం పొందుతారన్న వార్తలను "పుకార్లు"గా కొట్టిపారేశారు జాయ్. ఆమె US వీసా రద్దు చేశారన్న వార్తలు కూడా అవాస్తవమని పేర్కొన్నారు.

Read More
Next Story