AAP | వృద్ధులకు ఢిల్లీలో ఉచిత వైద్యం
x

AAP | వృద్ధులకు ఢిల్లీలో ఉచిత వైద్యం

తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. 'సంజీవని యోజన' కార్యక్రమ కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రీ ట్రీట్‌మెంట్ అందుతుందని తెలిపారు.

రెండ్రోజుల్లో రిజిస్ట్రేషన్..

"మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా కర్తవ్యం. ఇక మీరు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. చికిత్సకు అయ్యే ఖర్చుపై గరిష్ట పరిమితి ఉండదు. దీని కోసం ఒకటి లేదా రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఆప్ కార్యకర్తలు నగరవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి కార్డులు ఇస్తారు. వాటిని భద్రంగా ఉంచండి. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే మీకు నచ్చిన ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చు.’’ అని కేజ్రీవాల్ అన్నారు.

ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారు..

2015 ఫిబ్రవరి నుంచి ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేజ్రీవాల్ తన న్యూఢిల్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనుండగా.. ముఖ్యమంత్రి అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఢిల్లీ నివాసితులు విద్యుత్తు, తాగునీటిని పరిమితంగా వాడుకున్నంతవరకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

Read More
Next Story