ఆశారాంకు తాత్కాలిక బెయిల్ ..
x

ఆశారాంకు తాత్కాలిక బెయిల్ ..

తన ఆశ్రమంలో 2013 జరిగిన అత్యాచార కేసులో ఆశారాం నిందితుడు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది.


స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న ఆశారాం (Asaram)కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. 86 ఏళ్ల ఆశారాం..తన 77 ఏళ్ల భార్య లక్ష్మీదేవి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆమె బైపాస్ శస్త్రచికిత్స చేయించాల్సి ఉందని చెప్పడంతో ఆయనకు మార్చి 31 వరకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ (Bail) మంజూరు చేసింది. అయితే కొన్ని ఆంక్షలను కూడా విధించింది. విడుదలైన తర్వాత తన అనుచరులను కలవకూడదని న్యాయమూర్తులు ఎం ఎం సుంద్రేష్, రాజేష్ బిండల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఆశారాం ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు.

గాంధీనగర్ సమీపంలోని తన ఆశ్రమంలో 2013 జరిగిన అత్యాచార కేసులో ఆశారాం నిందితుడు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 2023 జనవరిలో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగిలినవారికి వారిని విడుదల చేశారు. 2023లో జీవిత ఖైదును సస్పెండ్ చేయాలంటూ ఆశారాం బాపు వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు గత ఏడాది ఆగస్టులో తిరస్కరించింది. ఆశారాం కుమారుడు నారాయణ్‌ సాయిపై కూడా అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో సాయికి జీవిత ఖైదు పడింది. ప్రస్తుతం అతను సూరత్ జైలులో ఉన్నాడు.

Read More
Next Story