ఢిల్లీ ఆప్ చీఫ్‌గా సౌరభ్ .. పంజాబ్‌కు ఇన్‌చార్జిగా సిసోడియా
x

ఢిల్లీ ఆప్ చీఫ్‌గా సౌరభ్ .. పంజాబ్‌కు ఇన్‌చార్జిగా సిసోడియా

వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం- ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎన్నికల హామీలు అమలుకాకపోవడంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ


ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం తన నివాసంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను పార్టీ ఢిల్లీ అధ్యక్షుడిగా నియమించారు. మరో సీనియర్ నేత మనిష్ సిసోడియా(Manish Sisodia)ను పంజాబ్‌లోని పార్టీ యూనిట్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు. గోపాల్ రాయ్‌ స్థానంలో భరద్వాజ్‌(Saurabh Bharadwaj), అలాగే ప్రస్తుతం దేశంలో AAP అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్‌లో పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు ఈ మార్పులు చేసినట్లు సమాచారం.

పార్టీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) సందీప్ పాఠక్ ప్రకారం..గుజరాత్‌ పార్టీ ఇన్‌చార్జిగా గోపాల్ రాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే సందీప్ పాఠక్ (రాజ్యసభ ఎంపీ) – ఛత్తీస్‌గఢ్‌కు, పంకజ్ గుప్తాను గోవాకు, మెహ్రాజ్ మలిక్‌ను జమ్మూ కశ్మీర్‌‌కు నియమించారు.

సమావేశంలో బీజేపీ ఎన్నికల హామీల అమలుపై కూడా చర్చకు వచ్చింది. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఉచిత LPG సిలిండర్ల పంపిణీ అమలు చేయకపోవడాన్ని అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

Read More
Next Story