హజ్ యాత్ర: చనిపోయిన యాత్రికుల్లో భారతీయులు.. ఎంతమంది అంటే..
x

హజ్ యాత్ర: చనిపోయిన యాత్రికుల్లో భారతీయులు.. ఎంతమంది అంటే..

పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లి మరణించిన వారిలో భారతీయులు కూడా ఉన్నారని సౌదీ దౌత్యవేత్త ధృవీకరించారు. అయితే వీరి సంఖ్యపై అంతర్జాతీయ, జాతీయ మీడియా మాత్రం..


హజ్ యాత్ర కోసం సౌదీలోని మక్కాకు వెళ్లి ఎండవేడికి తాళలేక 600 మందికి పైగా యాత్రికులు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా మరణించిన వారిలో 68 మంది భారతీయులు కూడా ఉన్నట్లు ఆ దేశ దౌత్యవేత్తలు తెలిపారు. వారిలో ఎక్కువమంది ఎండ వేడికి తాళలేక, తీవ్ర అలసటకు గురై మృత్యువాత పడ్డారని అంతర్జాతీయ మీడియా వార్తాకథనాలను ప్రసారం చేసింది.

యాత్రకు వచ్చి మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధ యాత్రికులే అని, వీరిలో చాలామంది ఎండవేడికి చాలామంది తట్టుకోలేకపోయి మరణించారని స్థానిక అధికారులు తెలియజేశారు. యాత్రకు వచ్చిన వారిలో చాలామంది భారతీయులు ఆచూకి ఇప్పటికి అందలేదని సమాచారం.

పెరుగుతున్న మృతులు
ముస్లింలు వారి జీవితకాలంలో కనీసం ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని వారి మతగ్రంథం పేర్కొంటుంది. అయితే ఈ యాత్ర కాలం వేసవిలో రావడంతో ప్రజలు అక్కడి ఎడారి వేడిని భరించలేకపోతున్నారు. యాత్రలోని ముఖ్యమైన ఆచారాలన్నీ కూడా ఎండవేడిలోనే చేయాల్సి ఉండటంతో ఈ తాపం భరించలేక ఇతర దేశాల ప్రజలు మృత్యువాత పడుతున్నారు.
సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్ దేశాల దౌత్యవేత్తలు పంచుకున్న గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం హజ్‌లో మరణించిన వారి మొత్తం సంఖ్య 600 కంటే ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తీర్థయాత్రలో మరణించిన వారిలో 90 మంది భారతీయులేనని ఇండియా టుడే నివేదిక పేర్కొంది.
జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ..
సౌదీ అధికారులు అందించిన ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలలో ఆశ్రయం పొందడం, క్రమం తప్పకుండా తాగునీరు, ఇతర పానీయాలు, తలపై నీరు పోయడం వంటి యాత్రికులు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాలు సంభవించాయి.
మరణించిన వారిలో చాలా మంది అధికారిక హజ్ వీసా ఖర్చులను భరించలేని రిజిస్టర్ కాని యాత్రికులు ఉన్నారని, అందువల్ల అందుబాటులో ఉన్న ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలను ఉపయోగించుకోలేకపోతున్నారని ఈజిప్టు దౌత్యవేత్త ఒకరు తెలిపారు. వీరిలో చాలా మంది తగినంత నీరు కూడా తాగడం లేదని, ఎండ నుంచి రక్షించుకోవడానికి గొడుగులు తీసుకెళ్లడం లేదని ఆయన అన్నారు.
సౌదీ అరేబియా అధికారికంగా మరణాల సంఖ్యపై సమాచారం అందించలేదు, అయితే ఆదివారం (జూన్ 16) ఒక్కరోజే 2,700 కంటే ఎక్కువ వేడి అలసట కేసులు నమోదయ్యాయి.



Read More
Next Story