బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, జీశాన్‌ను చంపేస్తామన్నదెవరు?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు జీశాన్ సిద్ధిక్‌ను హతమారుస్తామని ఫోన్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు జీశాన్ సిద్ధిక్‌ను హతమారుస్తామని ఫోన్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నోయిడాకు చెందిన 20 ఏళ్ల గుఫ్రాన్ ఖాన్‌గా గుర్తించారు. అక్టోబరు 12న సల్మాన్ ఖాన్ మిత్రుడు, ఎన్‌సీపీ (అజిత్ పవార్) నేత బాబా సిద్ధిఖీని ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా ఆయన కొడుకు జీశాన్ సిద్ధిఖీ కార్యాలయానికి అక్టోబర్ 25న హత్య బెదిరింపు కాల్ వచ్చింది. అక్టోబర్ 25 సాయంత్రంలోగా తాము చెప్పిన డబ్బు చెల్లించకపోతే సల్మాన్ ఖాన్, జీషాన్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేసిన గుఫ్రాన్ ఖాన్ అలియాస్ మహ్మద్ తయ్యబ్‌ను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నివాసి గుఫ్రాన్ ఖాన్‌ను నోయిడాలో అరెస్టు చేశామని, ప్రస్తుతం తమ అదుపులో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
అంతకుముందు ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌లో బెదిరింపు సందేశం పంపినందుకు 24 ఏళ్ల షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్ అనే జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రేతను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
గత కొంత కాలంగా పంజాబ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిషోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు హత్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి రూ.5 కోట్ల డిమాండ్ చేస్తూ సల్మాన్‌కు కాల్ వచ్చింది. అయితే దాన్ని పొరపాటున పంపానని పంపిన వ్యక్తి అంగీకరిస్తూ క్షమాపణ కోరాడు.
10 ఏళ్ల అభినవ్ అరోరాకు కూడా..
ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన 10 ఏళ్ల అభినవ్ అరోరాకు 'బాల్ సంత్ బాబా'గా పేరుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తన కొడుకును ప్రాణహాని ఉందని బాలుడి తల్లి చెబుతోంది. “ గత రాత్రి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. అభినవ్‌ను చంపేస్తామని ఈరోజు అదే నంబర్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది.’’ అని అభినవ్ తల్లి జ్యోతి ANIకి తెలిపారు. అయితే అభినవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధమేలేదని చెబుతున్నారు. అభినవ్ అరోరాకు Instagramలో 9లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను ఉన్నారని, కేవలం వైరల్ కావడానికి ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.