Bihar Elections: సీఎం అభ్యర్థిపై నితీశ్, బీజేపీ మధ్య విభేదాలు?
x

Bihar Elections: సీఎం అభ్యర్థిపై నితీశ్, బీజేపీ మధ్య విభేదాలు?

2025 బీహార్ ఎన్నికలకు ముందు NDA ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీహార్ ప్రజలు చర్చించుకుంటున్నారు.


2025 బీహార్ ఎన్నికలకు ముందు NDA సమిష్టిగా ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనం వహించడం ఊహాగానాలకు దారితీసింది. దీనిపై నీలు వ్యాస్ హోస్ట్‌‌గా వ్యవహరించే ‘‘ది ఫెడరల్ క్యాపిటల్ బీట్’’ తాజా ఎపిసోడ్‌లో రాజకీయ వ్యాఖ్యాతలు సతీష్ కె. సింగ్, అశోక్ మిశ్రా, జర్నలిస్టు టికె రాజలక్ష్మి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నితీష్ కుమార్, బీజేపీ మధ్య పెరుగుతున్న అసమ్మతి, బీహార్‌లో తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించారు.

నితీష్, బీజేపీ మధ్య విభేదాలే కారణమా?

2025 ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ఎన్డీయే నిర్ణయిస్తుందని అమిత్ షా చేసిన ప్రకటన నితీష్ కుమార్‌కు కోపం తెప్పించినట్లు సమాచారం. బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్ చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న సమయంలో అమిత్ షా మాటలు కొంత భిన్నంగా ఉన్నాయని అశోక్ మిశ్రా పేర్కొన్నారు.

బీహార్ రాజకీయాల్లో అలజడి..

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న విద్యార్థులకు జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు పలికారు. రాజకీయంగా ఎదగడానికి కిషోర్ అశాంతిని పెంచి పోషిస్తున్నట్లుందని టికె రాజలక్ష్మి పేర్కొన్నారు. కిషోర్ చర్యలు, బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని ఇది రాబోయే కాలంలో జేడీ (యూ) ఆర్డేడీ రెండింటినీ బలహీనపరచవచ్చని అశోక్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

బీజేపీకే నష్టం..

నితీష్ కుమార్ NDAకి, ముఖ్యంగా OBCలు, దళితులలో క్లిష్టమైన కుల-ఆధారిత ఓటరు మద్దతు ఇస్తున్నారు. అయితే నితీష్‌ విషయంలో ఏ పొరపాటు జరిగినా అటు బీహార్‌లో ఇటు జాతీయంగా బీజేపీకి నష్టం వాటిల్లవచ్చని సతీష్ కె. సింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రశాంత్ ప్రకటన..

2025 ఎన్నికల్లో మొత్తం 243 నియోజక వర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రకటన ఇతర పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. బీహార్‌లోని అన్ని ప్రధాన పార్టీలను ఆయన ఎలా దెబ్బతీసే అవకాశం ఉందో మిశ్రా హైలైట్ చేశారు.

Read More
Next Story