
కేరళలో వయసుపై బడిన ఏనుగుల పునరావాస కేంద్రం
సహజ వాతావరణంలో గొలుసులు లేకుండానే జీవనం..
అతి పెద్ద వన్య ప్రాణుల్లో ఒకటైన ఏనుగులను బంధించడం మహాపాపమని ప్రజల్లో నమ్మకం ఉంది. ఏనుగు రూపంతో ఉన్న గణపతిని కొలుస్తున్నాం. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పునరావాస కేంద్రాలు కేరళలో వెలుస్తున్నాయి. రక్షించబడిన ఏనుగులకు గొలుసుల్లేని సహజ వాతావరణంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 15 వరకు రక్షించబడిన కప్పుకాడు ఏనుగు పునరావాస కేంద్రం (ERC) కేరళలోని వయసుపైబడిన కుంకీ ఏనుగులకు నిలయం. కఠినమైన శిక్షణా పద్ధతులు లేకుండా పునరావాసం కల్పించడం ఇక్కడి ప్రత్యేకత.
పొడవైన రెండు దంతాలతో సోమన్ తన తలను మెల్లగా ఊపుతూ, చెవులు ఆడిస్తూ, లోతుగా శ్వాస తీసుకుంటూ కనిపించే గజరాజును చూస్తే ఎన్నో లోతైన విషయాలను ప్రస్పుటం చేస్తాయి. ఆ ఏనుగు ముఖంలో వృద్ధాప్య లక్షణాలు కనిపించకపోయినా, కాళ్లపై ఉన్న గొలుసుల మచ్చలు చూస్తే ఏనుగు బంధన జీవితాన్ని గుర్తు చేస్తాయి.
కొద్ది నెలల క్రితం, తిరువనంతపురం నుండి 35 కి.మీ దూరంలో ఉన్న కప్పుకాడు పునరావాస కేంద్రంలో లో ఈ కుంకీ ఏనుగు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. 85 ఏళ్ల వయసులో కూడా ఈ సోమన్ అనే పేరుగల ఏనుగు ప్రస్తుతం కేరళలో జీవించి ఉన్న వయసు పైబడిన ఏనుగుల్లో ఒకటి.
“ఏనుగు వెళ్లవద్దు,” అని సోమన్‌ను ఉంచిన షెడ్ వద్ద ఒక నోటీసు బోర్డు హెచ్చరిస్తుంది. కేరళ అటవీ శాఖ సమాచారం ప్రకారం, సోమన్ 1968లో రాణి అటవీ విభాగం నుంచి పట్టుబడింది. కొన్ని ఏనుగు శిబిరాల్లో శిక్షణ పొంది, కొత్తగా పట్టుబడిన ఏనుగులను శిక్షణ ఇచ్చే కుంకీగా పనిచేసింది. 1977లో అడవి ఏనుగులను పట్టుకోవడం నిషేధించిన సంగతి తలిసిందే.
బాధాకరమైన జీవితం
ఈ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రతి ఏనుగుకు ఒక బాధాకరమైన జీవితం ఉంది. రానా అనే ఏనుగు కేవలం ఒక సంవత్సరం వయసులో వ్యవసాయ భూమి చుట్టూ వేసిన ముళ్ల కంచెలో చిక్కుకుంది. 2013లో దాన్ని పునరావాస కేంద్రంకు తీసుకువచ్చారు. వైద్యుల చికిత్సతో రానా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. దీని వయసు 14 ఏళ్ళు.
అలాగే 48 ఏళ్ల రాజ్‌కుమార్ అనే దంతాలు లేని మగ ఏనుగును సర్కస్ నుంచి విముక్తి కల్పించారు. . 32 ఏళ్ల హరీష్‌ను దేవాలయం నుంచి పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు, అక్కడ ఆ ఏనుగు అనారోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుంది. . ఇప్పుడు ఈ ఏనుగులు ఆరోగ్యంగా పునరావాస కేంద్రంలో జీవిస్తున్నాయి.
సహజ వాతావరణంలో ఏనుగులు
ప్రస్తుతం ఈ పునరావాస కేంద్రంలో 15 ఏనుగులు ఉన్నాయి. 2008లో కేరళ అటవీ , వన్యప్రాణి శాఖ గుర్తింపు పొందడం ఈ కేంద్రం ప్రత్యేకత. . బంధీ అయిన అడవి ఏనుగులను రక్షించడం ఈ పునరావాసం కల్పించడం, అనాథ పిల్లలను సంరక్షించడం ఈ పునరావాస కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
మొదట 56 హెక్టార్ల భూమిలో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు 176 హెక్టార్లకు విస్తరించింది. ఇది గొలుసుల్లేని సహజ వాతావరణాన్ని కల్పిస్తోంది. ఇక్కడ కఠినమైన శిక్షణ పద్ధతులు అస్సలు లేవు. ఏనుగులు శిక్షకులతో మంచి సంబంధం కలిగి ఉంటాయి. ఒక ఏనుగు రోజు ఉదయం నీటి గొట్టంతో స్నానం చేసి దిన చర్య ప్రారంభమవుతుంది. తరువాత నేయ్యార్ జలాశయంలో స్నానం చేస్తుంది.
జాగ్రత్త కంపల్సరీ
ఏనుగులకు సీనియర్ శిక్షకుడు రాజు మాట్లాడుతూ, “వేసవిలో రోజుకు 3-4 సార్లు స్నానం చేయిస్తాం. చిన్న వయసు ఏనుగులు చిలిపిగా ఉంటాయి. కొన్నిసార్లు నీటి గొట్టాన్ని లాగుతాయి,” అన్నారు.
ఆరు నెలల క్రితం ఒక చిన్న ఏనుగు తనను లోపలికి లాగడంతో తన కాలు, చేయి విరిగి ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యానని తెలిపారు.
కొన్ని వారాల క్రితం మనూ అనే ఏనుగు స్నానవ చేయిస్తుండగా విష్ణు అనే శిక్షకుడిని తొక్కి చంపింది. ఇది పునరావాస కేంద్రం చరిత్రలో మొదటి ఘటన. ఇక్కడ భద్రతా చర్యలు అవసరమని మానవ హక్కుల కార్యకర్త ఉదయకుమార్ అన్నారు.
శ్రీకుట్టి కథ
శ్రీజ అనే ఉపాధ్యాయురాలు 2020లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లోశ్రీకుట్టి అనే ఏనుగును గుర్తు చేసుకున్నారు. 2019లో తల్లి చనిపోయిన తర్వాత గాయాలతో దాన్ని రక్షించారు. త్వరగా కోలుకుంది కానీ 2021లో జ్వరంతో మరణించింది.
విద్యార్థి ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు
ఏడో తరగతి విద్యార్థి ఆశిష్ మాట్లాడుతూ, “ఇక్కడ ఏనుగులను దగ్గరగా చూసాను. పెద్ద బియ్యం గుండ్లతో ఎలా ఆహారం ఇస్తారో ప్రత్యక్షంగా చూశాను. ఇది నాకు ప్రత్యేక అనుభవం,” అన్నారు. ఉబ్బితబ్బిబ్బు అయ్యానని వివరించారు.
భారతదేశంలో ఏనుగుల గణాంకాలు
భారతీయ ఏనుగు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏనుగులు రక్షించబడుతున్నాయి. అంచనా ప్రకారం ఇది ప్రమాదంలో ఉన్న జాతి అని చెప్పొచ్చు. 2025 అంచనా ప్రకారం భారతదేశంలో 22,446 అడవి ఏనుగులు ఉన్నాయి.
కర్ణాటకలో 6,013
అసోం 4,159
తమిళనాడు 3,136
కేరళ 2,785
ఉత్తరాఖండ్ 1,792
కేరళలో బంధీ ఏనుగులు
భారతదేశంలో 2,675 బంధీ ఏనుగులు ఉన్నాయి. వాటిలో 1,821 వ్యక్తిగత సంరక్షణలో ఉన్నాయి. కేరళలో ప్రస్తుతం 389 బందీ ఏనుగులు ఉన్నాయి (2018లో 521 ఉండేవి).
కేరళలో మరో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి కొడనాడ్, కొన్ణి. అయితే కప్పుకాడు పునరావాస కేంద్రం పూర్తిగా పునరావాసంపైనే దృష్టి సారించింది. ఏనుగు జీవించి ఉన్నా చనిపోయినా లాభమనుకునే స్మగ్లర్ల ఆగడాలు అరికట్టడానికి ఇలాంటి పునరావాస కేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.
Next Story

