Ayodhya | జనవరి 1 దృష్ట్యా రామ్‌లల్లా దర్శన వేళల పొడిగింపు
x

Ayodhya | జనవరి 1 దృష్ట్యా రామ్‌లల్లా దర్శన వేళల పొడిగింపు

అయోధ్య రామ్‌లల్లా దర్శనానికి ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అయితే కొత్త సంవత్సరం దృష్ట్యా రాత్రి 10 గంటల వరకు అనుమతించనున్నారు.


కొత్త సంవత్సరం సమీపిస్తుండడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఇప్పటికే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేసింది. దర్శన వేళలను గంట పొడిగించారు.

దర్శన వేళలు..

రామ్‌లల్లాను దర్శనానికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు. అయితే కొత్త సంవత్సరం దృష్ట్యా ఒక గంట పొడిగించారు. అంటే రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల స్వామికి విరామం సమయం. రోజుకు మూడుసార్లు హారతి ఇస్తారు. తెల్లవారుజామున 4.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, అలాగే రాత్రి 9.30 స్వామికి హారతి పడతారు.

గదులు లేవంటూ బోర్డులు..

ఇప్పటికే అయోధ్య, ఫైజాబాద్ ప్రాంతాల్లో దాదాపు అన్ని హోటళ్ళు పూర్తిగా బుక్ అయిపోయాయి. గదులు ఖాళీగా లేవంటూ కొన్ని హోటళ్లు ఏకంగా బోర్డులు పెట్టేశారు. కొంతమంది ఇదే అవకాశంగా భావించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఎంకైరీ చేసిన వాళ్లకు ఒక రాత్రి రూంలో స్టే చేయడానికి రూ.10,000కి పైగా ఖర్చ అవుతుందని చెబుతున్నారట.

పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సంఖ్య..

"జనవరిలో రామ మందిర ప్రారంభమైన తరువాత నెల రోజుల్లో ఏడు కోట్ల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ను సందర్శంచే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లో 32.18 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారు. 2024 తొలి ఆరు నెలల్లో ఈ సంఖ్య 32.98 కోట్లకు పెరిగింది.

అయోధ్య రామాలయం గురించి..

అయోధ్య రామమందిరంలో బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో మందిరం నిర్మాణం 2020 ఆగస్టు 5న ప్రారంభమైంది. 2.77 ఎకరాల విస్తీర్ణంలో నాగర శైలిలో నిర్మితమైన ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు, ప్రధాన గర్భగుడితో పాటు 51 అంగుళాల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Read More
Next Story