ఓబీసీల విషయంలో రాహుల్ పశ్చాత్తాపం..
x

ఓబీసీల విషయంలో రాహుల్ పశ్చాత్తాపం..

బీహార్ ఎన్నికల కోసమేనా? బీజేపీ నేతల మాటలకు కాంగ్రెస్ నేతల కౌంటర్ ఏమిటి?


తన 21 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓబీసీ(OBC)ల ప్రయోజనాలను కాపాడలేకపోయానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దళితుల సమస్యలపై అవగాహన ఉన్నా..ఓబీసీల విషయంలో లేదని ఒప్పుకున్నారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిన్న జరిగిన ఓబీసీ(OBC)ల 'భాగీదారీ న్యాయ్ సమ్మేళన్'లో కాంగ్రెస్(Congress) మాజీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలకు బీహార్ ఎన్నికలకు ఏమైనా లింకు ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన కులాల ఓటర్లు 63 శాతం ఉన్నారు. తన వైఫల్యాలకు బాధ్యత వహించడానికి వెనుకాడే వ్యక్తిని కాదని, తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్న మనిషినని చెప్పుకోవడం వెనక ఆయన బీహార్ ఎన్నికల(Bihar Polls)లో OBCల మద్దతు పొందాలని చూస్తున్నారని బీజేసీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు కౌంటర్‌గా ‘మీ మోదీ అలా చెప్పే ధైర్యం ఉందా?’ అని కాంగ్రెస్ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.


'మోదీ అలా చేయగలరా?'

"ఏ రాజకీయ నాయకుడయిన 'నేను తప్పు చేశాను', 'నేను విఫలమయ్యాను' అని చెప్పడం అంత సులభం కాదు. కానీ (ప్రధానమంత్రి) నరేంద్ర మోదీ (PM Modi) తాను తప్పు చేశానని లేదా విఫలమయ్యానని ఒప్పుకుంటారా?" అని కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధిపత, భగీదరి న్యాయ సమ్మేళన్ కీలక నిర్వాహకుడు అనిల్ జైహింద్ ది ఫెడరల్‌తో అన్నారు.

ఓబీసీల సాధికారత కోసమే..

రాహుల్ సహాయకులు ఆయనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతున్నారు. “రాహుల్ ఓ కరేజియస్ మ్యాన్. ఆయన వ్యాఖ్యలను సరైన దృక్కోణంలో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వేను పూర్తి చేసిన నేపథ్యంలో ఓబీసీ సాధికారత కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓబీసీ ముఖ్యమంత్రి (సిద్ధరామయ్య) నేతృత్వంలోని మన కర్ణాటక ప్రభుత్వం కూడా అదే ఎజెండాను అనుసరిస్తోంది. కాబట్టి రాహుల్ వ్యాఖ్యలు క్షమాపణ కింద చూడక్కర్లేదు. గతంలో జరిగిన కొన్ని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తానని చెప్పడమే ఆయన ఉద్దేశం. ”అని కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల జాతీయ సమన్వయకర్త కె రాజు పేర్కొన్నారు.

Read More
Next Story