రాయ్‌బరేలిలో రాహుల్..
x

ఎయిమ్స్ లో రాహుల్ వెంట వైద్యులు

రాయ్‌బరేలిలో రాహుల్..

రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పర్యటించారు. ఆయన అక్కడ ఎవరితో మాట్లాడారు? కీర్తి చక్ర గ్రహీత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లి అగ్నివీర్ స్కీమ్ గురించి ఎలా స్పందించారు?


కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం కీర్తి చక్ర గ్రహీత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కుటుంబ సభ్యులను కలిశారు. గతేడాది జూలైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాధితులను కాపాడే క్రమంలో కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించారు. ఆయన మరణానంతరం భారతదేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేసిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అన్షుమాన్ సింగ్ తల్లి విలేఖరులతో మాట్లాడారు. తమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అగ్నివీర్ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడారు.

"సైన్యాన్ని రెండు వర్గాలుగా విభజించవద్దని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అగ్నివీరులు నాలుగు సంవత్సరాల తర్వాత మానసికంగా, శారీరకంగా బలహీనపడిపోతారు. తర్వాత వారు తమ చదువును కొనసాగించలేరు. మరో వృత్తిని వెతుక్కుడానికి కష్టపడతారు. కాబట్టి నాలుగేళ్ల ఉద్యోగం మంచింది" అని అన్నారు.

రాయ్ బరేలి పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఎయిమ్స్‌ను కూడా సందర్శంచారు.

లక్నోలో దిగిన తర్వాత రాయ్‌బరేలీకి వెళ్లే మార్గంలో చుర్వాలోని హనుమాన్ ఆలయంలో రాహుల్ ప్రార్థనలు చేశారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి 3.90 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Read More
Next Story