ఆర్జేడీపై ప్రధాని మోదీ అటాక్..
x

ఆర్జేడీపై ప్రధాని మోదీ అటాక్..

బీహార్‌లో మహిళా రోజ్‌గార్ యోజన ప్రారంభం..


Click the Play button to hear this message in audio format

ప్రధాని మోదీ(PM Modi) శుక్రవారం (సెప్టెంబర్ 26) రాష్ట్రీయ జనతా దళ్ (RJD)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, దాని మిత్రపార్టీలు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలను కోరారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన తర్వాత.. బీహార్(Bihar) మహిళలనుద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. జీవనోపాధి కోసం 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 10,000 అందుకున్నారని చెప్పారు.

"ఆర్జేడీ పాలనలో మహిళలు ఎన్నో కష్టాలు పడ్డారు. రోడ్లు అధ్వానంగా ఉండేవి. వంతెనలు, కల్వర్టులు లేవు. గర్భిణులు సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేకపోయేవారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వీటి గురించి వారు పట్టించుపోవడం మానేశారు. అయితే నితీష్ కుమార్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులేమీ లేవు." అని మోదీ వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారతను ప్రస్తావిస్తూ..ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న 75 లక్షల మంది లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణతో పాటు అదనంగా ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు అందిస్తామని ప్రకటించారు మోదీ.

ఈ కొత్త పథకాన్ని నితీష్ కుమార్ ప్రభుత్వం మైలురాయిగా అభివర్ణిస్తూ.. "ఒక సోదరి లేదా కుమార్తె ఉద్యోగం పొందినపుడు లేదా స్వావలంబన సాధించినపుడు ఆమె సామాజిక గౌరవం పెరుగుతుంది" అని మోదీ అన్నారు. ఉజ్వల యోజన కింద 8.5 కోట్ల మంది నివాసితులకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో బీహార్‌లో జీవితాలు మెరుగుపడతాయని మోదీ పేర్కొన్నారు.

Read More
Next Story