‘మమ్మల్ని చంపేస్తారనన్న భయంతోనే..’
x

‘మమ్మల్ని చంపేస్తారనన్న భయంతోనే..’

గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం తర్వాత గౌరవ్, సౌరబ్ దేశం విడిచి పారిపోడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు; ముందస్తు బెయిల్‌కు నిరాకరణ..


Click the Play button to hear this message in audio format

తమను జనం కొట్టి చంపుతారన్న భయంతోనే మేం పారిపోయామని గోవా నైట్‌క్లబ్ యజమానులయిన గౌరవ్, సౌరబ్ లూత్రా సోదరులు(Luthra brothers) తెలిపారు. ఇదే విషయాన్ని రాస్తూ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలోని రోహిణి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ రాత్రి గోవా(Goa) నైట్‌క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్‌’లో అగ్ని ప్రమాదం(fire accident) సంభవించి 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే.


‘ప్రాణ భయంతోనే..’

"లూత్రా సోదరులకు ప్రాణ భయం ఉంది. వారిని గోవాలో కొట్టి చంపే అవకాశం ఉంది. వారి ఇతర రెస్టారెంట్లను కూల్చేసే ప్రమాదం ఉంది. వారిద్దరూ దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దర్యాప్తు అధికారులు ఎక్కడికి రమ్మన్నా వెళ్తారు. కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’’ అని లూత్రా సోదరుల తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.


‘ముందస్తు బెయిల్ ఇవ్వలేం’

అయితే జడ్జి వందన లాయర్ వాదనను తోసిపుచ్చారు. ‘‘ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే (డిసెంబర్ 7న తెల్లవారుజామున 1.17 గంటలకు) దేశం నుంచి పారిపోవాలని ఇద్దరూ విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఉదయం 5.20 గంటలకు విమానం థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరింది. నిందితుల ప్రాణాలకు " ముప్పు" ఉందనే వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. నేర తీవ్రత దృష్ట్యా వారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం కుదరదు అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. క్లబ్‌ లైసెన్స్ అగ్రిమెంట్, ట్రేడ్ లైసెన్స్, లీజు డీడ్ కూడా ముగిసిపోయాయని పోలీసులు న్యాయమూర్తి ముందుంచారు.


'వైద్య కారణాలూ ఫలితం చూపలేదు'

గౌరవ్ లూత్రా తన పిటిషన్‌లో వైద్య కారణాలను చూపుతూ ముందస్తు బెయిల్‌ కోరాడు. మూర్ఛ వ్యాధితో పాటు రక్తపోటు ఉన్నందున గౌరవ్‌‌కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపు లాయర్ వాదించారు. అయితే వైద్యానికి సంబంధించిన పత్రాలు పాతవి కావడంతో బెయిల్ నిరాకరించారు జడ్జి.


‘దయ చూపకూడదు..’

"వారు వెళ్ళిపోయి దాక్కున్నారు. ఇప్పుడు దయ చూపాలని కోరుతున్నారు." "ఒక వ్యక్తి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తేలితే కోర్టు అతనికి సాయపడకూడదు’’ అని గోవాకు చెందిన లాయర్ కోర్టుకు తెలిపారు.

Read More
Next Story