West Bengal | 'ఒక దేశం, ఒకే ఎన్నిక’కు టీఎంసీ వ్యతిరేకం
‘ఒక దేశం, ఒకే ఎన్నిక’కు సంబంధించిన రెండు బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే 'ఒక దేశం, ఒకే ఎన్నిక ' (One Nation-One Election)' అంశాన్ని కేంద్రం తెరమీదకు తెచ్చిందని రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. తన బ్లాగ్ పోస్ట్‌లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ వాస్తవ పరిస్థితి నుంచి జనం దృష్టికి మరల్చడానికి "ఒక దేశం, ఒకే ఎన్నిక’’ ప్రతిపాదన తెచ్చారని రాసుకొచ్చారు. ఈ ప్రతిపాదనపై TMCకి అభ్యంతరాలు ఉన్నాయని, పార్టీ ఎంపీలు దీనికి మద్దతు ఇవ్వబోరని చెప్పారు. ఈ బిల్లు గతేడాది ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును పోలి ఉందని ఓబ్రెయిన్ అభిప్రాయపడ్డారు. ‘జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. అది 2034లో జరగవచ్చు’ అని పేర్కొ్న్నారు.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఏకకాల ఎన్నికలు జరపడానికి ఆర్టికల్ 324A సవరణకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి, అలాగే ఒకే ఓటరు జాబితా తయారీకి ఆర్టికల్ 325కి సవరణ అవసరం. దీనికి కూడా సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అనుమతి అవసరం.’’ అని పేర్కొ్న్నారు.
‘ఒక దేశం, ఒకే ఎన్నిక’కు సంబంధించిన రెండు బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు.