Jharkhand | ఆదాయ పెంపు మార్గాలపై అధ్యయనానికి ఒడిశాకు జార్ఖండ్ బృందం
x

Jharkhand | ఆదాయ పెంపు మార్గాలపై అధ్యయనానికి ఒడిశాకు జార్ఖండ్ బృందం

‘‘దేశంలోని ఖనిజ నిల్వల్లో 40 శాతం ఉన్న జార్ఖండ్‌లో మైనింగ్ రంగం నుంచి ఏటా కేవలం రూ.11వేల-12వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది’’ ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్.


మైనింగ్ రంగం నుంచి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అధ్యయనం చేసేందుకు త్వరలో ఓ బృందాన్ని ఒడిశాకు పంపనున్నట్లు జార్ఖండ్ ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్ తెలిపారు. దేశంలోని ఖనిజ నిల్వల్లో 40 శాతం ఉన్న జార్ఖండ్‌లో మైనింగ్ రంగం నుంచి ఏటా కేవలం రూ.11వేల-12వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని, పొరుగున ఉన్న ఒడిశా దాదాపు రూ.40,000 కోట్లు గడిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని కిషోర్ పీటీఐతో అన్నారు.

ఒడిశా వెళ్లనున్న బృందం..

మైనింగ్ రంగం నుంచి ఎలా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై అధ్యయనం చేసేందుకు మైనింగ్ అధికారుల బృందాన్ని ఒడిశాకు పంపాలని తన శాఖలోని సీనియర్ అధికారులను కోరానని చెప్పారు. ఆర్థిక, కమర్షియల్ ట్యాక్స్, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలను కేటాయించడంతో కాంగ్రెస్ నేత కిషోర్ ఇటీవల ఆయన బాధ్యతలు స్వీకరించారు.

పింఛన్ రూ.2,500లకు పెంపు..

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆర్థిక,సామాజిక అభివృద్ధికి సీఎం హేమంత్ సోరెన్ కృషి చేశారని చెబుతూ.. గ్రామీణ ప్రజల స్వావలంబనకు మైయాన్ సమ్మాన్ యోజనతో సహా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తినడానికి తిండి లేని ఇళ్లు చాలా ఉన్నాయని, వారి ఆహార భద్రత కోసం మైయాన్ సమ్మాన్ యోజనను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ పథకం కింద గతంలో రూ. 1,000 అందేనని ఇప్పుడు వారికి నెలకు రూ. 2,500అందుతుందని చెప్పారు.

Read More
Next Story