బరేలీ హింస: నిందితులకు యోగీ మార్క్ ట్రీట్ మెంట్
x
నిందితుడి ఫంక్షన్ హాల్ కూల్చివేస్తున్న ప్రోక్లెయిన్ లు

బరేలీ హింస: నిందితులకు యోగీ మార్క్ ట్రీట్ మెంట్

నిందితులకు చెందిన బాంక్వెట్ హాల్ ను కూల్చివేసిన అధికారులు


బరేలీలో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం పేరిట ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులపై దాడి, ఆస్తుల విధ్వంసానికి కారణమైన ప్రధాని నిందితుడికి చెందిన ఫంక్షన్ హాల్ ను ఉత్తర ప్రదేశ్ అధికారులు శనివారం కూల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

బరెలీ డెవలప్ మెంట్ అధారిటీ(బీడీఏ) కట్టుదిట్టమైన భద్రతతో కూల్చివేతను నిర్వహించింది. ఈ ఫంక్షన్ హాల్ పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
మూడు గంటల ఆపరేషన్..
‘రజా ప్యాలెస్ బాంక్వెట్ హల్’’ నుంచే సెప్టెంబర్ 26న నిందితులు హింసను ప్రేరేపించడానికి ఉపయోగించుకున్నారు. అరెస్ట్ అయిన మతాధికారి తౌజీర్ రజాఖాన్ కు సన్నిహితుడిగా ఉన్న డాక్టర్ నఫీస్ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నాడని తేలింది. ఘర్షణలకు సంబంధించి నఫీస్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
మధ్యాహ్నం సమయంలో మూడు బుల్డోజర్లు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నాయి. కూల్చివేతను ప్రారంభించానికి ముందు ప్రధాన గేటును కూల్చివేశాయి. బీడీఏ బృందం ఆవరణను మూసివేసి నిర్మాణంలోని అక్రమ భాగాలను కూల్చివేయడం ప్రారంభించాయి. ఇందుకోసం దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ తెల్లవారుజామున ప్రారంభం అయింది. సిటీ పోలీస్ సూపరింటెండెంట్ మనుష్ పారిఖ్ నేతృత్వంలోని పెద్ద సంఖ్యలో పోలీసులు, పీఏసీ సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
చట్టపరమైన ప్రక్రియ..
చట్టం ప్రకారం కాకుండా ఈ ఫంక్షన్ హాల్ ను ఇష్టానుసారం నిర్మించారని బీడీఏ వైస్ చైర్మన్ మణికందన్ అన్నారు. ‘‘చట్టపరమైన ప్రక్రియ ప్రకారం కచ్చితంగా చర్య తీసుకున్నారు. ఇది ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 26న ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్లపై నమోదైన ఎఫ్ఐఆర్ లను వ్యతిరేకిస్తూ నిరసనకారులు శుక్రవారం ప్రార్థన తరువాత ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారు.
దీనికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇస్లామిస్టులు పోలీసులపై దాడికి పాల్పడి, స్థానిక వ్యాపారాలను ధ్వంసం చేశారు. దీనిలో అనేకమంది గాయపడ్డారు.
హింసకు సంబంధించి పోలీసులు 11 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి వందలాది మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఎక్కువ మంది గుర్తుతెలియని వ్యక్తులే ఉన్నారు. మత గురువు అయితన తౌకీర్ రజా ఖాన్, ఆయన అనుచరులు, బంధువులతో సహ 70 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Read More
Next Story