ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో నుంచి గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు?
x

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో నుంచి గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు?

ప్రియాంక వాద్రా గాంధీ విమర్శలు


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా అభ్యంతరం తెలిపారు. ఈ పథకం పేరు నుంచి మహాత్ముడి పేరును తొలగించడం వెనక అధికార పార్టీ ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. గాంధీ మనదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే పేరు పొందిన మహనీయుడని అన్నారు.

యూపీఏ కాలం నాటి పథకం..
యూపీఏ కాలం నాటి పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం. దీనికి 2005 లో రూపకల్పన చేశారు. ప్రస్తుతం దీనిని రద్దు చేసి దీని స్థానంలో ఒక బిల్లు వికసిత్ భారత్- రోజ్ గార్, అజీవక మిషన్ (గ్రామీణ్) (వీబీ- ఏఆర్ఎంజీ) బిల్లు -2025 ను కేంద్రం సిద్దం చేసింది.
ప్రస్తుత పార్లమెంట్ శీతకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టబోతోంది. దీనర్థం 2005 నాటి పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై ప్రియాంక వాద్రా మాట్లాడుతూ.. ‘‘ ఒక పథకం పేరు మారినప్పుడల్లా, కార్యాలయాల్లో స్టేషనరీలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కాబట్టి ప్రయోజనం ఏమిటీ? ఎందుకు చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.
‘‘మహాత్మాగాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? మహాత్మా గాంధీని దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా పరిగణిస్తారు. కాబట్టి ఆయన పేరు తొలగించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. వారి లక్ష్యం ఏంటీ?’’ అని పార్లమెంట్ హౌజ్ లో కాంప్లెక్స్ లో విలేకరులతో అన్నారు.
‘‘మేము చర్చించేటప్పుడూ కూడా అది ఇతర సమస్యలపైనే ఉంటుంది. ప్రజల నిజమైన సమస్యలపై కాదు. సమయం వృథా అవుతోంది. డబ్బు వృథా అవుతోంది. వారు తమను తాము అంతరాయం కలిగించుకుంటున్నారు’’ అని వయనాడ్ ఎంపీ అన్నారు.
125 రోజుల ఉపాధి హమీ..
వికసిత్ భారత్ -2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధి చట్రాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం లేని చేతి పనిని చేపట్టడానికి స్వచ్చందంగా ముందుకు వస్తే ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధిని చట్టబద్దంగా అందిస్తుంది.
ఈ బిల్లు సోమవారం కేంద్రం జారీ చేసిన అనుబంధ వ్యవహరాలలో కనిపించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ బిల్లు ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తూ.. గత 20 సంవత్సరాలుగా ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వేతన ఉపాధిని కల్పించిందని అన్నారు.
సామాజిక భద్రతా జోక్యాల విస్తృత కవరేజ్, ప్రధాన ప్రభుత్వ పథకాల సంతృప్త ఆధారిత అమలు ద్వారా గ్రామీణ ప్రకృతి దృశ్యంలో గణనీయమైన సామాజిక ఆర్థిక పరివర్తన కనిపించిన దృష్ట్యా మరింత బలోపేతం అవసరం అని ఆయన అన్నారు.


Read More
Next Story