
కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, పవన్ ఖేరా
కాంగ్రెస్ నిర్వహించే ‘జై హింద్ ’ ర్యాలీల లక్ష్యం ఏంటీ?
ప్రధాని మోదీ నుంచి ఆశించిన సమాధానాలను గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాబట్టుకోగలదా?
ఆపరేషన్ సిందూర్ బీజేపీకి, ప్రధాని మోదీకి రాజకీయంగా లాభించే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ‘జైహింద్’ ర్యాలీలు, సభలు నిర్వహించాలని భావిస్తోంది. పాకిస్తాన్ పై ఒక్కసారిగా ఎందుకు ఆపివేశారనే విషయంలో ప్రధానికి వ్యతిరేకంగా గళమెత్తాలని యోచిస్తోంది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు న్యూఢిల్లీలో అనధికారికంగా సమావేశం అయ్యారని, పార్టీ నిర్వహించబోయే జైహింద్ ర్యాలీలపై కథనంపై మరోసారి సమగ్రంగా చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసిన వెంటనే ప్రారంభమైన పాకిస్తాన్ తో వివాదం ఇంకా ఉధృతంగా ఉన్నప్పుడూ, భారత సాయుధ దళాలకు సంఘీభావం ప్రకటించడానికి ఈ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని మొదట్లో ప్రణాళికలు వేశారు.
అయితే మే 10 న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. దీనితో దేశంలో చాలామంది అభ్యంతరం పెట్టారు. అయితే విదేశాంగ శాఖ వీటిని ఖండించింది. ట్రంప్ తో జరిగిన చర్చల్లో వాణిజ్యం అంశాలు రాలేదని ప్రకటించింది.
కాంగ్రెస్ నిర్వహించబోయే జైహింద్ ర్యాలీలో ఈ అంశాన్ని హైలైట్ చేయాలని పార్టీ భావిస్తోంది. జాతీయ భద్రత, దేశ సార్వభౌమత్వం వంటి అంశాలపై ప్రధాని నుంచి సమాధానాలు రాబట్టడానికి వీటిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ విజయం దేశ భద్రతా వైఫల్యాలను బయటకు రానివ్వకుండ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే ట్రంప్ వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించడం వంటి కేంద్ర వైఫల్యాన్ని కప్పివేస్తుందని పార్టీ భావిస్తోంది.
ఉగ్రవాదంపై ప్రధాని మోదీ బలంగా ఉంటారనే అభిప్రాయాన్ని తప్పని చెప్పడానికి కాల్పుల విరమణ ఒప్పందం ఉపయోగపడుతుందని, మోదీని ఇరుకున పెట్టడానికి ఈ అంశం ఉపయోగపడుతుందని గ్రాండ్ ఓల్డ్ పార్టీ భావన.
భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే విదేశాంగ శాఖ దీనిని కూడా తోసిపుచ్చింది. ఈ సమస్య కేవలం దైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని, మూడో ప్రమేయం అవసరం లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ కాంగ్రెస్ ఈ విషయం పై ప్రధాని సమాధానం చెప్పాలని పట్టుబడుతోంది.
సమాధానం లేని ప్రశ్నలంటున్న కాంగ్రెస్..
పాకిస్తాన్ పై దాడిచేస్తున్న సమయంలో భారత్ ఆకస్మికంగా ముగించడాన్ని సమాధానం లేని ప్రశ్నలు మిగిల్చిందని బుధవారం అనధికారిక సీడబ్ల్యూసీ ఆమోదించిన తీర్మానం పేర్కొన్నట్లు సమాచారం.
‘‘స్పష్టత లేకుండా సంఘర్షణను ఆకస్మాత్తుగా నిలిపివేయడం దేశవ్యాప్తంగా అనేక ఊహగానాలు, ఆందోళనలకు దారితీసింది. అలాగే ట్రంప్ వాణిజ్య బెదిరింపులు ద్వారా కాల్పుల విరమణ జరిగిందని చెబుతున్నారు. ఈ విషయం పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి’’ అని తీర్మానం పేర్కొంది. ప్రభుత్వం దేశ సార్వభౌమత్వం, ప్రతిష్టను రాజీ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కేంద్రం చేసిన ఈ దాడి పహల్గామ్ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ చేశారని, అలాగే పర్యాటక ప్రాంతంలో భద్రతా వైఫల్యాల వలనే ఉగ్రవాదులు అమాయకులను హత్య చేశారని, జైహింద్ ర్యాలీలో ఇదే ప్రధాన అంశాలుగా ఉంటుందని భావిస్తున్నారు.
ఏ ఒత్తిడితో మోదీ కాల్పుల విరమణ అంగీకరించారు?
ఆపరేషన్ సిందూర్, తరువాత జరిగిన ఘర్షణలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించిన నిబంధనలపై మోదీకి ఆ పార్టీ ప్రశ్నలు సంధిస్తోంది.
‘‘ఆపరేషన్ సిందూర్ తరువాత మూడురోజుల పాటు భారత సాయుధ దళాలు పాకిస్తాన్ లోని సైనిక బేస్ లు ధ్వంసం చేస్తున్న తరువాత అకస్మాత్తుగా సైన్యాన్ని ఆపమని ఆదేశించిన సంగతి దేశం మొత్తం చూసింది. కాల్పుల విరమణకు అంగీకరించడానికి ఆయనపై(ప్రధాని మోదీ) ఎలాంటి ఒత్తిడి పనిచేసిందని ఆయన మాత్రమే చెప్పగలరు’’ అని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా విలేకరులతో అన్నారు.
కాల్పుల విరమణకు ముందు జరిగిన విషయాల గురించి ట్రంప్ చేస్తున్న వాదనలపై విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ ఖేరా ఆశ్చర్యపోయారు.
‘‘యుద్ధ విరమణపై చర్చలు జరపడానికి భారతదేశంతో వాణిజ్యాన్ని ఆపివేస్తాననే బెదిరింపును ఉపయోగించినట్లు అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. ఇది నిజమో కాదో ప్రధాని దేశానికి చెప్పాలి.
జాతీయ భద్రత, సార్వభౌమాధికారం గురించి చాలా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నందున, ఈ స్పష్టత ప్రధానమంత్రి నుంచి రావాలి. పేరులేని వ్యక్తులు లేదా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నుంచి కాదు. భారత భద్రత, సార్వభౌమాధికారం కంటే వాణిజ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా?’’ అని ఖేరా అడిగారు. మోదీ సాయుధ దళాల వెనక దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, దానిని మేము అనుమతించమని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది.
బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. సాయుధ దళాల వెనక దాక్కుని మోదీ పరిశీలన నుంచి తప్పించుకోకూడదని పార్టీ నాయకత్వం కృతనిశ్చయంతో ఉంది.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి తగినంత విధంగా కృషి చేయలేదని, 1971 యుద్దంలో ఎందుకు పీఓజేకే ను స్వాధీనం చేసుకోలేదని బీజేపీ మంత్రులు ప్రసంగం చేస్తారు.
ఇప్పుడు మీరు ఎందుకు కాల్పులు ఆపారు. దేశ సార్వభౌమత్వాన్ని మీరు ఎవరికి తాకట్టు పెట్టారు. కాల్పుల విరమణ ఆపినందుకు మీకు పాక్ నుంచి ఎలాంటి హమీలు వచ్చాయి. ’’ అని ఆ సీనియర్ నాయకుడు ప్రశ్నించారు.
కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ జైరాం రమేష్ కూడా మోదీ కాల్పుల విరమణపై మౌనం పాటించి ఆపరేషన్ సిందూర్ పై రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
‘‘పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించడానికి వీలుగా ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము.
కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. మరో వైపు ఆపరేషన్ సిందూర్ క్రెడిట్ మోడీకి ఇవ్వడానికి ఆయన పార్టీ బీజేపీ తిరంగయాత్రలు చేస్తోంది. ప్రధానమంత్రి మే 25న ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆపరేషన్ సిందూర్ ను రాజకీయం చేయడానికి ఇది చేసే ప్రయత్నం కాదా? ఇలాంటి సమయంలో ఆయన పార్టీలకు అతీతంగా అన్ని ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరిని విశ్వాసంలోకి తీసుకుని అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండాలి’’ అని రమేష్ అన్నారు.
పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ భారత్ కు అప్పగిస్తామని పాకిస్తాన్ మీకు హమీ ఇచ్చిందా? గతంలో భారత్ లో ఉగ్రదాడులు చేసిన తరువాత పాకిస్తాన్ లో సురక్షితంగా ఉన్నవారిని అప్పగిస్తామని చెప్పారు.
కాల్పుల విరమణకు అంగీకరించే ముందు మీరు ఎలాంటి హమీని పొందాడానికి ప్రయత్నించారు? ’’ అని మోదీ దేశానికి తెలియజేయాలని కాంగ్రెస్ కోరుతోందని ఖేరా అన్నారు. పార్టీ జైహింద్ సభలు, ర్యాలీలలో కూడా ఈ అంశాలు లేవనెత్తుతామని ఖేరా అన్నారు.
Next Story