ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది: చైనా
x

ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది: చైనా

తూర్పు లఢఖ్ లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..


గత ఐదు సంవత్సరాలుగా చైనా- భారత్ మధ్య సరిహద్దు విషయంలో సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కుదిరిన ఒప్పందం తరువాత ఇరు దేశాల సైన్యాలు తూర్పు లఢఖ్ నుంచి ఉప సంహరించుకోవడం ప్రారంభించాయి. ఇరు దేశాల మధ్య డిస్ ఎంగేజ్మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని చైనా సైతం ప్రకటించింది.

అక్టోబర్ 23న, రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా తమ ద్వైపాక్షిక సమావేశంలో తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి పెట్రోలింగ్, డిసెంగేజ్‌మెంట్ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ - చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఆమోదించారు.
"సరిహద్దు ప్రాంత సమస్యలపై ఇటీవల చైనా - భారత్ చేరుకున్న తీర్మానాలకు అనుగుణంగా, చైనా - భారత సరిహద్దు దళాలు సంబంధిత పనిలో నిమగ్నమై ఉన్నాయి, ఇది ప్రస్తుతం సజావుగా సాగుతోంది" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మీడియా సమావేశంలో తెలిపారు.
అక్టోబరు 21న ఘర్షణ పాయింట్ల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ఒప్పందాన్ని భారత్ ప్రకటించింది. చైనా ఒక రోజు తర్వాత రెండు వైపులా "సంబంధిత విషయాలపై తీర్మానాలు" చేసుకున్నామని ధృవీకరించింది. బీజింగ్ ఈ తీర్మానాలను అమలు చేయడానికి న్యూఢిల్లీతో కలిసి పని చేస్తామని వెల్లడించింది.
డిస్ ఎంగేజ్ మెంట్..
ఈ ఒప్పందాన్ని అనుసరించి, తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, దేప్సాంగ్ ప్లెయిన్స్‌లోని రెండు ఘర్షణాత్మక పాయింట్ల వద్ద రెండు దేశాలు దళాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయని, ఈ ప్రక్రియ అక్టోబర్ 28-29 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భారత ఆర్మీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ రెండు ఘర్షణ పాయింట్ల కోసం మాత్రమే ఒప్పందం కుదిరింది. ఇతర ప్రాంతాలకు సంబంధించి "చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి" అని వారు చెప్పారు.
రెండు రోజుల క్రితం ప్రారంభమైన సైనిక బలగాల ఉపసంహరణ, అది పూర్తయిన తరువాత పెట్రోలింగ్ ప్రారంభమవుతుందని, తరువాత ఇరు దేశాల సైనిక నిర్మాణాలను కూల్చివేస్తామని భారత్- చైనా సైనిక నిర్మాణాలు తెలిపాయి. ఈ ప్రాంతాలను 2020కి ముందున్న స్థితికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జూన్ 2020లో గాల్వాన్ వ్యాలీలో సంఘర్షణ
జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు ఆసియా దిగ్గజాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది దశాబ్దాలుగా ఇరుపక్షాల మధ్య అత్యంత తీవ్రమైన సైనిక సంఘర్షణగా గుర్తించబడింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అక్టోబర్ 21న న్యూఢిల్లీలో మాట్లాడుతూ, గత కొన్ని వారాలుగా జరిగిన చర్చల తర్వాత ఒప్పందం ఖరారైందని, 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఇది దారి తీస్తుందని చెప్పారు.


Read More
Next Story