
ఆధార్ ను కూడా ఆధారంగానే పరిగణిస్తాం: ఈసీ
సుప్రీంకోర్టుకు వెల్లడించిన ఎన్నికల సంఘం
బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద సవరించిన ఓటర్ల జాబితాలో ఓటర్ ను చేర్చడానికి, తొలగించడానికి ఒక వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి ఆధార్ ను కూడా పరిగణిస్తామని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
సిబల్..
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదీ కాంగ్రెస్ మాజీ ఎంపీ కపిల్ సిబల్ ఆధార్ ను కూడా గుర్తింపు కార్డుగా అంగీకరించాలి అన్నారు. ఓటర్ జాబితాలో పేరు ఉన్న వారికి ఈ అవకాశం కల్పించాలన్నారు.
‘‘బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) పౌరసత్వాన్ని నిర్ణయించలేరు. 65 లక్షల మందికి నివాస రుజువు ఉండి ఆధార్ ను అంగీకరించడం లేదు. ఈసీ అధికారులను ఆదేశించింది. నేను ఓటర్ జాబితాలో ఉంటే ఆధార్ ను కూడా పరిగణించనివ్వండి’’ అని సిబల్ అన్నారు.
‘‘సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం.. వారి ఆధార్ కార్డులతో పాటు ఫిర్యాదును సమర్పించాలని పబ్లిక్ నోటీస్ లో పేర్కొనాల్సి వచ్చింది. ఆధార్ ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పబడింది.
వారు ఆధార్ ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నాను. 11 పత్రాలలో ఒకటి అవసరమని బీఎల్ఓ ఆదేశించారు. 11 పత్రాలు అంగీకరించినందుకు ఈసీ అధికారులను శిక్షిస్తుంది’’ అని బార్ అండ్ బెంచ్ ఉటంకించినట్లు ఆయన అన్నారు.
ఈసీకి సుప్రీం ఆదేశం..
గతంలో సుప్రీంకోర్టు ఆధార్ ను చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ‘‘వారు తమ దరఖాస్తు ఫారమ్ లను సమర్పించనివ్వండి. అది ఆధార్ కార్డుతో అయినా లేదా మెట్రిక్యూలేషన్ సర్టిఫికెట్ అయిన’’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, తిరిగి చేర్చడానికి దరఖాస్తులను ఆధార్ లేదా ఆమోదించబడిన 11 ఇతర పత్రాలలో దేనితోనైనా సమర్పించవచ్చని తీర్పు ఇచ్చింది.
జస్టిస్ కాంత్ వశ్యతను నొక్కి చెప్పారు. ఓటర్లు, ఆధార్ కార్డు లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లతో దరఖాస్తులను సమర్పించవచ్చిన పేర్కొన్నారు.
బీహార్ లోని రాజకీయా పార్టీలపై సుప్రీంకోర్టు విమర్శలు..
బీహార్ రాజకీయ పార్టీలు తమ సాంప్రదాయ మద్దతుదారులు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఈ సవరణను వ్యతిరేకించినప్పటికీ జాబితా నుంచి తొలగించబడిన 65 లక్షలకు పైగా ఓటర్లకు సాయం చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు వారిని మందలించింది.
ఓటర్ల క్లెయిమ ఫారమ్ లను సమర్పించే బూత్ స్థాయి ఏజెంట్లకు రసీదులు అందించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈసీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదీ రాకేష్ ద్వివేదీ ఎటువంటి అక్రమ మినహాయింపులు జరగలేదని నిరూపించడానికి 15 రోజుల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు.
85 మినహాయించబడిన ఓటర్లు క్లెయిమ్ ఫారాలను సమర్పించారని 2 లక్షలకు పైగా కొత్త ఓటర్లు సార్ కింద తమ పేర్లు నమోదు చేసుకున్నారని కమిషన్ నివేదించింది.
Next Story