గెలుపును అడ్డుకుంటారా? మెజారిటీని తగ్గిస్తారా?
x

గెలుపును అడ్డుకుంటారా? మెజారిటీని తగ్గిస్తారా?

ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేయబోతున్న వారణాసిలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ ఆప్ పోటీ చేయనప్పటికీ..


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ప్రచారం చేయడానికి సమాయత్తం అవుతున్నాడు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అనుమతి కోసం వేచి చూస్తున్నాడని ఆప్ వర్గాలు అంటున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఆయనకు ఎన్నికల ప్రచారం కోసమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అది కూడా జూన్ 1 వరకు మాత్రమే. సీఎంగా ఎలాంటి అధికారిక విధులు నిర్వహించకూడదని షరతులు సైతం విధించింది అత్యున్నత న్యాయస్థానం.
ముఖ్యంగా, కేజ్రీవాల్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై వారణాసిలో పోటీ చేసి రెండు లక్షలకు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జూన్ 1న జరగనున్న వారణాసి ఎన్నికలకు మోదీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌తో(యూపీ కాంగ్రెస్ చీఫ్) పాటు మరో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.అయినప్పటికీ, మోదీ విజయం పై ఎవరికి అనుమానాలు లేవు. ఆయన మెజారిటీ తగ్గించే ప్రయత్నాలే చేస్తున్నారని సుస్పష్టం.
కాంగ్రెస్ ఆమోదం కోసం..
మోదీకి వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ కాంగ్రెస్ అనుమతిని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి, అయితే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు.
దీని గురించి మంగళవారం ఢిల్లీలో ఒక ఆప్ కార్యకర్తను అడిగితే, “వారణాసి లోక్‌సభ స్థానానికి ఇండి కూటమి తరపున కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కాబట్టి నియోజకవర్గంలో ప్రచారానికి ఎవరెవరు అవసరమో కాంగ్రెస్ నిర్ణయించుకోవాల్సి ఉంది. తన నియోజకవర్గంలో మోదీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అవసరమని భావించిన దాని ప్రకారం ఆప్ వెళ్తుంది. AAP, ఇండి కూటమిలో చురుకైన భాగస్వామి, అందువల్ల, ఎన్నికలలో సంకీర్ణ విజయానికి దాని వంతు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ చేస్తుందన్నారు.
ప్రచారంలో కేజ్రీవాల్
మే 16న, కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో కలిసి లక్నోలో పర్యటించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. దీనికి ఒక రోజు ముందు, ఢిల్లీ సీఎం వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులైన కన్హయ్య కుమార్, ఉదిత్ రాజ్‌లకు మద్దతుగా ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీలో రోడ్‌షోలు నిర్వహించారు.
కేజ్రీవాల్ మే 21న జంషెడ్‌పూర్‌ని సందర్శించారు. అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌తో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ర్యాలీలో ప్రసంగించారు. వేదికపై మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కూడా ఉన్నారు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
ఆప్ వర్సెస్ బీజేపీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టు, స్వల్పకాలిక బెయిల్‌పై విడుదలైన తర్వాత జరిగిన పరిణామాలు ఆప్, బీజేపీల మధ్య పోరు మరింత ముదిరి పాకాన పడ్డాయని పరిస్థితులను బట్టీ చూస్తే తెలుస్తోంది. దేశంలో మరో రెండు దశల ఎన్నికల పోరు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
తదుపరి దశలో, ఏడు దశల ఎన్నికలలో ఆరవది, మే 25న ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత, కేజ్రీవాల్, AAP కథనం ప్రకారం, పంజాబ్‌తో పాటు వారణాసిపై కూడా దృష్టి పెట్టవచ్చు. జూన్ 1న చివరి దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.
ప్రతిపక్షాల లక్ష్యం
2014లో కేజ్రీవాల్‌పై 50 శాతానికి పైగా ఓట్లు సాధించి వారణాసి సీటును మోదీ అద్భుతంగా గెలుచుకున్నారు. కానీ 2014లో వారణాసిలో అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు పోటీలో ఉన్నందున, ఆప్, కాంగ్రెస్ అనేక ఇతర అభ్యర్థుల మధ్య ఓట్లు చీలిపోయాయి. అయినప్పటికీ, కేజ్రీవాల్ రెండవ స్థానంలో నిలిచారు. ఆయన రెండు లక్షల ఓట్లు సాధించారు.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి అథర్ జమాల్ లారీ కూడా ప్రస్తుతం పోటీలో చేరినప్పటికీ, ఈసారి, మోదీ, అజయ్ రాయ్ మధ్యే ప్రధాన పోటీ. ఇప్పుడు ప్రధానంగా ఎన్‌డిఎ, ఇండి కూటమి పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా నడుస్తోంది, ఇక్కడ బిఎస్‌పి అభ్యర్థికి బిజెపి- కాంగ్రెస్‌ల వలె ఓటర్ల ఫ్యాన్సీని తన వైపుకు తిప్పుకునే అవకాశం లేదు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి మే 20న లక్నోలో ఐదవ దశలో ఓటు వేసిన తర్వాత స్వయంగా ఓ మాటన్నారు. ఈసారి పరివర్తన్ (మార్పు) పై ప్రజలు మౌనంగా ఉన్నారని, దీనర్థం ఏంటంటే ఇక్కడ మోదీనే గెలవబోతున్నారని చెప్పకనే చెప్పారు.
కానీ మోదీ మాత్రం "నిశ్శబ్దం" వీగిపోవాలని కోరుకుంటున్నారు. ప్రధాని మంగళవారం (మే 21) వారణాసిలో ప్రచారం చేశారు. మహిళలు బయటకు వచ్చి ఓటు వేయాలని, ఇతర మహిళలను సైతం ప్రొత్సహించాలని కోరారు.ఆయన గెలుపు ఖాయమని ఇక్కడ కాంగ్రెస్ కూడా నమ్మిన దాఖల కనిపిస్తోంది. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఆ గెలుపు సులువుగా దక్కకూడదని మాత్రం పట్టుదలగా పోరాడుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మోదీ ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లను సాధించాడు.
కేజ్రీవాల్ ఏం కోరుకుంటున్నారు
2019 ఎన్నికల్లో మోదీ భారీగా ఓట్లు పొందినప్పటికీ, కేజ్రీవాల్, పవిత్ర పట్టణంలో ప్రచారానికి దూకడం ద్వారా, నియోజకవర్గంలో మూడ్ మార్చడానికి ప్రయత్నించవచ్చు. విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న సమయంలో కూడా ఢిల్లీలో కరెంట్ కోతలు విధించకుండా నిరంతరాయంగా సప్లై చేసి ప్రజల మన్నలు పొందాడు. ఆయన హయాంలోనే పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఓ రేవున పడ్డాయి.
ఇవి తక్కువ విజయాలు కావు. కేజ్రీవాల్‌కు, కేంద్రానికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఢిల్లీలో అధికారంలో కొనసాగడమే కాకుండా, అతని పార్టీ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీ పౌర వ్యవస్థ పునరుజ్జీవన నమూనా కారణంగా బీజేపీ గందరగోళానికి గురవుతుందని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఎన్నికలు ప్రారంభం కావడంతో, తనను ప్రచారం నుంచి తప్పించేందుకే జైల్లో పెట్టారనేది అతని ఆరోపణ.
అయితే అత్యున్నత న్యాయస్థానం అందుకు విరుద్ధంగా అతడిని జైలు నుంచి బయటకు పంపింది. ఇప్పుడు కేజ్రీవాల్ బీజేపీ దెబ్బతీయడానికి తన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. అయితే ఇప్పుడు వారణాసి బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది.


Read More
Next Story