కొత్త రికార్డు సృష్టించిన వందే భారత్ స్లీపర్ రైలు
x
గరిష్ట వేగాన్ని అందుకున్న వందే భారత్ స్లీపర్ రైలు

కొత్త రికార్డు సృష్టించిన వందే భారత్ స్లీపర్ రైలు

టెస్ట్ రన్ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన అశ్విని వైష్ణవ్, గ్లాస్ లోని నీళ్లు కదలకుండా 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకున్న రైలు


భారత రైల్వే కొత్త చరిత్ర లిఖించింది. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రైలు గరిష్ట వేగంతో ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా ఎటువంటి కుదుపులు లేకుండా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం వందే భారత్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుండగా, స్లీపర్ వేరియంట్ ను గంటకు 180 కిలోమీటర్ల వేగం అందుకుంది. అయితే వాస్తవ ఆపరేటింగ్ వేగం భారత రైల్వే నెట్ వర్క్ లోని ట్రాక్ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ స్లీపర్ రైళ్లు స్వదేశీ కవచ్ యాంటి కోలిషన్ సిస్టమ్ తో సహ అధునాతన భద్రతా ప్రమాణాలను పాటించింది. అలాగే చైర్ కార్ వెర్షన్ లాగా పునరుత్పత్తి బ్రేకింగ్ టెక్నాలజీ కూడా వాడారు.
రైల్వే మంత్రి అశ్విన వైష్ణవ్ మంగళవారం(డిసెంబర్ 31) సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు కోటా- నాగ్థా మార్గంలో 180 కిలీమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, గ్లాస్ నీటి పరీక్షలో స్థిరంగా ముందుకు సాగిందని వీడియో చూపించారు.
‘‘ఈ రోజు కమిషనర్ రైల్వే సేప్టీ వందే భారత్ స్లీపర్ ను పరిక్షించారు. ఇది కోట నాగ్ధా సెక్షన్ మధ్య 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది. మా స్వంత నీటి పరీక్ష ఈ కొత్త తరం రైలు సాంకేతిక లక్షణాలను ప్రదర్శించింది’’ అని వైష్ణవ్ ఎక్స్ లో పోస్ట్ లో రాసుకొచ్చారు.
రైలు లోపల నుంచి తీసిన వీడియో, మొబైల్ స్క్రీన్ లో దాని వేగం గంటకు 182 కిలోమీటర్ల లకు చేరుకుందని చూపించింది. నీటితో నిండిన గ్లాసు కదలకుండా సంపూర్ణ సమతుల్యతతో ఉంది. ఇది రైలు స్థిరత్వాన్ని చూపుతోంది.
లక్షణాలు..
వందే భారత్ స్లీపర్ మొదటి రెండు నమూనాలలో 16 కోచ్ లు ఉన్నాయి. వీటిలో 11 ఎయిర్ కండిషనర్డ్ త్రీ టైర్ కోచ్ లు, నాలుగు, నాలుగు ఎయిర్ కండిషన్డ్ టూ టైర్ కోచ్ లు, ఒక ఎయిర్ కండిషన్డ్ ఫస్ట్ క్లాస్ కోచ్ లు ఉన్నాయి.
సెమీ స్పీడ్ సర్వీస్ గా రూపొందించబడిన ఇది యూరోపియన్ రోలింగ్ స్టాక్ నుంచి డిజైన్ అంశాల ఆధారంగా రూపొందించబడింది. స్లీపర్ రైలు పున: రూపకల్పన చేసిన అప్పర్ బెర్త్ యాక్సెస్ తో పాటు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కుషన్డ్ బెర్త్ లను అందిస్తుంది.
ప్రయాణీకుల సౌకర్యాలలో తక్కువ తీవ్రత గల రాత్రి లైటింగ్ విజువల డిస్ ప్లే సిస్టమ్ ల మద్దతు ఉన్న ఆడియో ప్రకటనలు, సీసీటీవీ నిఘా, మాడ్యులర్ ఫ్యాంట్రీ కార్ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రైళ్లలో విమానాలలో ఉపయోగించే మాదిరిగానే అధునాతన బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. వికలాంగుల కోసం అందుబాటులో ఉన్న టాయిలెట్, బేబీ కేర్ యూనిట్ ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ లో వేడీ నీటితో కూడిన షవర్ క్యూబికల్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
ఇంకా కొన్ని స్లీపర్ రైళ్లు..
ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ భాగస్వామ్యంతో బీఈఎంఎల్ తయారు చేస్తోంది. ఇది పది రైళ్ల సెట్లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. మరో పది భారతీయ, రష్యన్ భాగస్వాముల జాయింట్ వెంచర్ అయిన కైనెట్ అభివృద్ధి చేస్తోంది.
వీటికి తోడు టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, బీహెచ్ఇఎల్ కన్సార్టియం 80 స్లీపర్ వేరియంట్లను తయారు చేయడాన్ని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విడిగా, ఐపీఎఫ్ వందే భారత్ రైలు దాని స్వంత ఇన్ హౌజ్ స్లీపర్ వెర్షన్ అభివృద్ధి చేస్తోంది.
సుఖవంతమైన రైలు ప్రయాణం..
ప్రభుత్వం ప్రస్తుతం భారతీయ రైల్వేలో వందే భారత్ రైళ్లను సెమీ హై స్పీడ్ సర్వీస్ లు గా వర్గీకరించింది. వీటిని 180 కిలోమీటర్ల వేగంతో నడిచేలా డిజైన్ చేశారు. కానీ ప్రస్తుతం ఇవి 160 కిలోమీటర్ల వేగంతో నడపడానికి అనుమతి ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం రైలు వేగం ట్రాక్, అది ప్రయాణించే మార్గంలో ఉన్న స్టాప్ ల ఆధారపడి ఉంటుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ తన సంవత్సరాంతపు సమీక్షలో మరో కీలక ప్రకటన చేశారు. త్వరలో ఏసీ తరగతి ప్రయాణీకుల కోసం ప్రవేశపెట్టబోయే వందే భారత్ రైళ్లు, సుదూర రైలు ప్రయాణాన్ని తీసుకువస్తాయని, ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గిస్తాయని, అధిక డిమాండ్ ఉన్న మార్గాలలో వీటిని ప్రారంభించిన తరువాత దేశమంతటా విస్తరించబోతున్నామని తెలిపారు.
వందే భారత్ రైళ్లు..
డిసెంబర్ 26 నాటికి దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 272 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అయిన ధాంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ 2025 లో పూర్తయి జాతికి అంకితం అయింది.
ఇది 36 ప్రధాన సొరంగాలు, 943 వంతెనల గుండా ప్రయాణిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సవాల్ తో కూడిన భూభాగం. ఇక్కడ అసాధారణ ఇంజనీరింగ్ ప్రతిభ కనపరిచి రైలు మార్గాలను నిర్మించారు.
మిజోరాంలో 51 కిలోమీటర్ల బైరాబి- సెరాంగ్ బ్రాడ్ గేజ్ లైన్ సెప్టెంబర్ 2025 లో ప్రారంభం అయింది. ఇది ఐజ్వాల్ కు నేరుగా రైలు సర్వీస్ నడుపుతుంది. సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి రైల్వేలు రాబోయే కొన్ని సంవత్సరాలలో 200 కి పైగా స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.


Read More
Next Story