ఓడించారనే ప్రతీకారంతోనే ఎన్ కౌంటర్లు : అఖిలేష్ యాదవ్
x

ఓడించారనే ప్రతీకారంతోనే ఎన్ కౌంటర్లు : అఖిలేష్ యాదవ్

సార్వత్రిక ఎన్నికల్లో యూపీ ప్రజలు తమను ఓడించారనే ప్రతీకారంతోనే బీజేపీ చిన్న స్థాయి దొంగలను కూడా ఎన్ కౌంటర్ చేస్తోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.


లోక్ సభలో జరిగిన పరాభవాన్ని దృష్టి మళ్లించడానికే సుల్తాన్ పూర్ లో జరిగిన దోపిడి కేసు నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఇది పూర్తిగా కుట్ర పూరితమైందని, ఈ ఎన్ కౌంటర్లు ఉత్తర ప్రదేశ్ భవిష్యత్ కు మంచిది కాదని అన్నారు. ఉన్నావ్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుల్తాన్‌పూర్ నగల దుకాణం దోపిడీ కేసులో నిందితుడు అనూజ్ ప్రతాప్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) కాల్చి చంపింది.

ఆగస్టు 28న జరిగిన దోపిడీలో మరో నిందితుడు మంగేష్ యాదవ్‌ను కూడా STF ఎన్ కౌంటర్ చేసింది. తాజాగా ఈ రోజు మరోసారి రెండో నిందితుడు కూడా పోలీసుల చేత ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. మొదటి ఎన్ కౌంటర్ జరిగిన సమయంలోనే అఖిలేష్ యాదవ్ దీనిని నకిలీగా విమర్శించారు. ఇది పూర్తిగా కుల ప్రేరేపితమని, బిజెపి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తాజా ఎన్‌కౌంటర్‌పై యాదవ్ స్పందిస్తూ, "బలహీనమైన ప్రజలు ఎన్‌కౌంటర్‌లను తమ బలంగా భావిస్తారు. ఎవరికైనా బూటకపు ఎన్‌కౌంటర్ అన్యాయమే. హింస, రక్తంతో ఉత్తరప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చడం రాష్ట్ర భవిష్యత్తుపై పెద్ద కుట్ర " అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటమిని ఊహించి ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ఉద్దేశపూర్వకంగా అశాంతి సృష్టిస్తోందని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు.
'ఈరోజు అధికారంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎన్నటికీ మళ్లీ ఎన్నికలు రాలేవని తెలుసు. అందుకే వెళ్లేముందు ఉత్తరప్రదేశ్‌లో ఎవరూ రాని, పెట్టుబడులు పెట్టని పరిస్థితిని కల్పించాలనుకుంటున్నారు' అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందని యాదవ్ ఆరోపించారు.
'ఉత్తరప్రదేశ్‌లో అవగాహన ఉన్న ప్రజలు ఓడించిన తీరుకు బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోంది. సొంత భవిష్యత్తు లేనివారే భవిష్యత్తును పాడుచేసుకుంటారు' అని ఆయన అన్నారు. అనూజ్ ప్రతాప్ సింగ్ తండ్రి ధరమ్ రాజ్ సింగ్ తన కుమారుడి మరణం వెనుక రాజకీయ కారణాలను ఆరోపించారు.
‘నా కొడుకు రాజకీయాల బాధితుడయ్యాడని.. అతడిపై ఒకటి రెండు కేసులు మాత్రమే ఉన్నాయని, అయినా ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడని’ అన్నారు. "అఖిలేష్ యాదవ్ కోరిక నెరవేరింది, ఒక ఠాకూర్ ఎన్‌కౌంటర్ అయ్యాడు" అని అతను చెప్పాడు. కొంతమందిపై ముప్పై నలభై కేసులు ఉన్నా క్షేమంగా ఉన్నారని, కేవలం ఒకటి రెండు కేసులు ఉన్నా వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు నిందితుల "కులం" చేత ప్రేరేపించబడ్డాయని యాదవ్ ఇటీవలి కాలంలో పేర్కొన్నాడు. STFని "స్పెషల్ ఠాకూర్ ఫోర్స్" లేదా "సార్-ఏ-ఆమ్ థోకో ఫోర్స్" అని విమర్శలు గుప్పిస్తున్నాడు. పది సంవత్సరాలుగా అధికారంలో లేకపోవడంతో అఖిలేష్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని బీజేపీ ఎదురుదాడికి దిగింది. పోలీసులు మాత్రం మాజీ సీఎం ఆరోపణలను ఖండించారు.


Read More
Next Story