
మహాకుంభ మేళాలో స్నానమాచరిస్తున్న భక్తులు, సాధువులు
ఉత్తరప్రదేశ్ 2025: పెరిగిన స్వదేశీ, విదేశీ పర్యాటకులు
మహాకుంభ్ లో పవిత్ర స్నానాలు ఆచరించిన 66 కోట్ల మంది, కాశీ, మధుర, అయోధ్య లోనూ పెరిగిన యాత్రికులు
మహాకుంభమేళా సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పవిత్ర నగరానికి ప్రయాణించిన భక్తులు అనేక మంది సందర్శకులు తమ తీర్థయాత్రలలో భాగంగా మధుర, కాశీ, అయోధ్య తో పాటు ఇతర ప్రాంతాలలో పర్యటించారు.
కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్..
మతపరమైన పర్యాటక కేంద్రంగా ప్రయాగ్ రాజ్ ఎదుగుదల మహాకుంభ్ కంటే ముందే ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత పర్యాటకుల సంఖ్య పెరిగింది.
గత ఏడాది జనవరి 29న జరిగిన మౌనీ అమావాస్య సందర్భంగా మహ కుంభ్ లో దాదాపు ఎనిమిది కోట్ల మంది భక్తులు వచ్చారు. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాట తరువాత భక్తులు కాస్త తగ్గారు.
అయితే కొద్దిరోజులు మాత్రమే ఇది జరిగింది. తరువాత యథావిధిగా మళ్లీ పర్యాటకుల తాకిడి పెరిగింది. తొక్కిసలాటలో దాదాపు 37 మంది మరణించారు. అయితే భక్తులు మాత్రం ఎక్కడా తగ్గకుండా తమ భక్తిని చాటుకుంటూ పవిత్ర స్నానాలు ఆచరించారు.
2017 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి అఖండమైన మెజారిటితో అధికారంలోకి వచ్చింది. మొదటి సారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత యోగీ ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో హిందూ ధార్మిక వాతావరణం పెరిగింది.
నవంబర్ 25న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ సమక్షంలో ప్రధానమంత్రి రామాలయంలో ధ్వజారోహాణ నిర్వహించారు. 2017, 2025 లో అయోధ్యలో వార్షిక దీపోత్సవ ఉత్సవ్ ను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కాశీ కారిడార్...
అంతకుముందు డిసెంబర్ 2021 లో మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించారు. ఇది ఆలయాన్ని గంగా నది వెంబడి ఉన్న ఘాట్ లతో అనుసంధానించింది. అభివృద్ధి పనుల తరువాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించడానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలోనూ, ఆయన నివసించిన బృందావనంలో భక్తుల తాకిడి పెరిగింది.
అధికారిక సమాచారం ప్రకారం.. గత సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహాకుంభమేళాకు 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు వచ్చారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పవిత్ర ఆలయాలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
2024 లో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. 649.1 మిలియన్లకు పైగా పర్యాటకులు యూపీకి వచ్చారు. ఇందులో 2.36 మిలియన్ల విదేశీ పర్యాటకులు ఉన్నారు. 2025 లో ఆరునెలలో పర్యాటకుల సంఖ్య 1.21 బిలియన్లు గా ఉంది. ఇందులో 3.3 మిలియన్లు విదేశీ పర్యాటకులు ఉన్నారని అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం.. జనవరి- జూన్ మధ్య మధురను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 3.37 కోట్లు దాటింది. కాశీలో ఇది 12.96, అయోధ్య 23.82 కోట్లకు చేరింది.
కన్వర్ యాత్ర..
కన్వర్ యాత్ర సందర్భంగా ఏడుకోట్లకు పైగా భక్తులు వివిధ శివాలయాలలో గంగా నదీ జలంతో అభిషేకాలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మతపరమైన ప్రదేశాలలో జాతీయ పర్యాటక రంగంలో దాని వాటా పెరుగుదలకు తోడ్పాడ్డాయి. 2016 లో పర్యాటక రంగం వాటా 13.1 శాతం 2024 నాటికి 19-20 శాతానికి పైగా పెరిగాయని తెలిసింది.
ఒక మహాకుంభ మేళాకు 66 కోట్ల మంది భక్తులు రావడం పర్యాటక రంగంలో ప్రపంచ రికార్డు సృష్టించిందని ఆదిత్యనాథ్ అన్నారు. కాశీ, అయోధ్య, మధుర, బంకే బిహారీ ధామ్, వింధ్యవాసిని, ధామ్, చిత్రకూట్, నైమిశారణ్య, శాకుంభరీ ధామ్, దేవీపతన్ థామ్, సారనాథ్, కుషీ నగర్, లుంబినీ, కపిల్వాస్తు, శ్రావస్తి, కౌశాంబి వంటి ప్రదేశాలు కూడా సాధారణ పర్యాటకులను కూడా ఆకర్షిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
వారసత్వ పరిరక్షణ..
ఉత్తర ప్రదేశ్ లో వారసత్వ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం 2025 లో ఊపదుకుంది. ఆగష్టులో సంభాల్ లో ఉన్న ఆక్రమణలు తొలగించిన యోగీ ఆదిత్యనాథ్, అక్కడ 659 కోట్ల విలువైన 222 అభివృద్ధి ప్రాజెక్ట్ లను ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలను వెలికి తీసి వాటిని పునరుద్దరిస్తామని ఆయన ప్రకటించారు.
బౌద్ధ పర్యాటకం..
ఉత్తరప్రదేశ్ లోని బౌద్ధ సర్క్యూట్ ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సారనాథ్, కుషీ నగర్, శ్రావస్థి, కౌశాంబి, కపిలవస్తు, సంకిసా వంటి ఆరు ప్రధాన కేంద్రాలు యూపీలో ఉన్నాయి.
పర్యాటక శాఖ డేటా ప్రకారం.. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ రాష్ట్రంలోని బౌద్ధ ప్రదేశాలను సందర్శించే దేశీయ, విదేశీ పర్యాటకులు గణనీయమైన సంఖ్యలో వచ్చారు.
దేశీయ పర్యాటకుల సంఖ్య 58 లక్షలుగా ఉండగా, విదేశీ పర్యాటకుల సంఖ్య 2,71,259 మందిగా ఉన్నారు. 2025 చివరి నాటికి పర్యాటకుల సంఖ్య 64 లక్షలు దాటవచ్చని పర్యాటక శాఖ అంచనా వేసింది.
Next Story

