రోహింగ్యాలు, బంగ్లాదేశీయులపై యూపీ పోలీసుల దృష్టి
x
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు

రోహింగ్యాలు, బంగ్లాదేశీయులపై యూపీ పోలీసుల దృష్టి

అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక డ్రైవ్


అక్రమ వలసదారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహ ఇతర అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకుని వారణాసి పోలీస్ కమిషనరేట్ వారం రోజుల పాటు ప్రత్యేక ధృవీకరణ డ్రైవ్ ను ప్రారంభించిందని అధికారులు తెలిపారు.

తాత్కాలిక స్థావరాలలో నివసిస్తున్న అనేకమంది ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వీరిని గుర్తించడానికి వారణాసి అంతటా బృందాలను మోహరించినట్లు కాశీ జోన్ డిప్యూటీ కమిషననర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) గౌరవ్ బన్స్యాల్ తెలిపారు.

శనివారం ప్రారంభమైన వారం రోజుల ప్రచారం, అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు.

‘‘ఏడు రోజుల ధృవీకరణ ప్రచారంలో, పోలీసు బృందాలు గుడిసె సమూహాలను, రోడ్డు పక్కన నివసిస్తున్న వారిని తనిఖీ చేస్తున్నాయి. ధృవీకరణ తరువాత చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించిన వ్యక్తులు నిబంధనల ప్రకారం కఠినమైన, ప్రభావవంతమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని బన్స్యాల్ చెప్పారు.

జిల్లాలోని అన్ని స్టేషన్ హౌజ్ అధికారులు తమ తమ అధికార పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం అదనపు డీసీపీ గోమతి జోన్ వైభవ్ బంగర్ కోయిరాజ్ పూర్ లో ప్రత్యేక ధృవీకరణ ఆపరేషన్ కు నాయకత్వం వహించారు.
తనిఖీ చేసిన వ్యక్తుల పూర్తి చిత్రాలు, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, నేపథ్యం, పత్రాలను బృందాలు తనిఖీ చేశాయి. వారి వ్యక్తిగత వివరాలను నియమించబడిన ఫారమ్ లలో నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
బారగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతర యూనిట్ల బృందాలు తీవ్ర నిఘాతో డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. వారణాసి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో ప్రత్యేక ధృవీకరణ క్రమపద్దతిలో కొనసాగుతోంది.


Read More
Next Story