
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పోలీస్ ఉన్నతాధికారులు
సుప్రీం ఆదేశాలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులపై యూపీ సీఎం ఫోకస్
ప్రత్యేక బృందాలతో డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు
శిల్పిసేన్
దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, అన్ని వసతులు పొందుతున్న రోహింగ్యా, బంగ్లాదేశీయులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.
అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపరిపాలన విభాగంలో తాత్కాలిక నిర్భంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత చొరబాటులపై కూడా నివేదిక ఇవ్వాలని కోరింది.
అక్రమ బంగ్లాదేశీయుల జాబితా..
చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అక్రమ బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారుల జాబితాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి యూపీలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లను కోరారు.
ఈ జాబితాలను కమిషనర్, ఇన్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు అందజేస్తారు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ చొరబాటుదారులను తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లోనే ఉంచి, వారి స్వదేశాలకు పంపిస్తారు. ఆదేశాలు రావడం ప్రారంభించినందున, పోలీస్ యంత్రాంగం ఈ అంశంపై ప్రధాన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నవంబర్ 22న ఆదిత్యనాథ్ అన్ని జిల్లా న్యాయాధికారులతో మాట్లాడారు. భారత్ లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులను అత్యవసరంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్రమంగా నివసిస్తున్న లేదా వారి గుర్తింపులను దాచిపెట్టిన బంగ్లాదేశీయులను గుర్తించడానికి అధికారులు ఇప్పటికే యూపీలోని అనేక నగరాల్లో మురికివాడలు, ఎంపిక చేసిన ప్రదేశాలపై దాడులు నిర్వహించారు.
ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, ఓటర్ ఐడీ కార్డులను తనిఖీ చేయడం ద్వారా పౌరసత్వాన్ని ధృవీకరించడానికి పోలీసులు ఇప్పటికే ప్రచారాలు నిర్వహించారు. ఇప్పుడు యూపీ అంతటా ఈ ప్రచారం ఉంటుంది. లక్నోలోని ఠాకూర్ గంజ్ ప్రాంతంలో నర్గీస్ అనే బంగ్లాదేశ్ మహిళను ఇటీవల అరెస్ట్ చేశారు.
సుప్రీంకోర్టు కఠిన వైఖరి..
ఇటీవల ఓ హెబియస్ కార్పస్ పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు, దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నవారికి రెడ్ కార్పొట్ పరచలేమని పేర్కొంది. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భారత్ కు లేదని పేర్కొంది.
అక్రమ చొరబాటుదారులకు గుర్తించాలని యూపీ పరిపాలన త్వరలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద ఆపరేషన్ గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Next Story

