ఢిల్లీ వీధి కుక్కల అంశాన్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం
x
సుప్రీంకోర్టు

ఢిల్లీ వీధి కుక్కల అంశాన్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం

ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై విమర్శలు, ఆందోళన బాట పట్టిన జంతు ప్రేమికులు


ఢిల్లీ- ఎన్సీఆర్ నుంచి అన్ని వీధి కుక్కలను షెల్టర్ హోమ్ లకు తరలించాలన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనం విచారిస్తోంది.

ఈకేసును జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, ఎన్వీ అంజరియా విచారిస్తున్నారు. ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆగష్టు 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్రమైన నిరసన వ్యక్తమైన తరుణంలో కొత్త బెంచ్ కు కేసును బదిలీ చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తీ జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులు తనే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ఇలా చెప్పిన కొన్ని గంటల తరువాత ఈ కేసు గురువారం విచారణకు జాబితా చేశారు.

ఆగష్టు 11న ఉత్తర్వులూ..
ఆగష్టు 11న జారీ చేసిన ఉత్తర్వులలో జస్టిస్ పార్థివాలా, ఆర్ మహదేవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఢిల్లీ- ఎన్సీఆర్ లోని వీధులల్లోని అన్ని కుక్కలను శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది.
నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో విడుదల చేసిన ఉత్తర్వు వివరణాత్మక కాపీ ఆశ్రయాలలో వీధి జంతువులపై దుర్వినియోగం, క్రూరత్వం లేదా దుర్భరమైన సంరక్షణ ప్రమాణాలకు గురికాకుండా హమీ ఇస్తునే కోర్టు తన నిర్ణయం ప్రాముఖ్యతను కూడా వివరించింది.
జంతు ప్రేమికుల నిరసన..
సుప్రీంకోర్టు ఆగష్టు 11న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని జంతు ప్రేమికులు బుధవారం డిమాండ్ చేశారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవం ఎవరి కోసం? అనే ప్లకార్డులు పట్టుకుని ఎన్సీపీ (ఎస్పీ) ప్రతినిధి అనిష్ గవాండే, కార్యకర్త రాయ్ మాన్వి, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు, మాజీ కేంద్ర మంత్రి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సోదరీ అంబికా శుక్లా, కార్యకర్తలు స్వచ్చంద సంస్థ సేవకులు పాల్గొన్నారు.
మతం, భాష ఇప్పుడు ‘‘జంతు ప్రేమికులు, జంతు ద్వేషికులు’’ మధ్య కూడా ప్రతిచోట విభజనలు ఉన్నాయని పేర్కొంటూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వూ ఎంత క్రూరమైందో ప్రజలు అర్థం చేసుకోవాలని శుక్లా కోరారు.
నిరసనకారులు మా కుక్కలను రక్షించండి’’.. ‘‘ఢిల్లీ ప్రభుత్వం, ఆదేశాన్ని వెనక్కి తీసుకోండి’’ వంటి నినాదాలు చేస్తూ, శివుని చిత్రాలతో పాటు వీధి కుక్కల పోస్టర్లను ప్రదర్శిస్తూ.. ‘‘హమ్ హూంగే కా మ్యాబ్’’ పాటను పాడారు. ఇప్పటి వరకూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 100 వీధి కుక్కలను పట్టుకుంది.
Read More
Next Story