‘మా పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి’’ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి
x
జస్టిస్ బీఆర్ గవాయి

‘మా పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి’’ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి

పార్లమెంట్, కార్యనిర్వహాక విధులల్లో జోక్యంపై స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయ్


సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తదుపరి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు.

అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పార్లమెంటరీ, కార్యనిర్వహాక విధుల్లో చొరబడిందనే ఆరోపణలు ఎదుర్కొంటోందని అన్నారు.

పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా ఇటీవల జరిగిన హింసాకాండపై కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాదీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నాము..
‘‘యూనియన్ కు మాండమస్ డైరెక్టరింగ్ జారీ చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇప్పటికే పార్లమెంటరీ, కార్యనిర్వాహాక విధుల్లో మేము చొరబడ్డామని ఆరోపణలు ఉన్నాయి’’ అని జస్టిస్ గవాయ్ అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో వక్ప్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఇటీవల హింస చెలరేగిన నేపథ్యంలో న్యాయవాదీ విష్ణు శంకర్ జైన్ తన పెండింగ్ పిటిషన్ ను ప్రస్తావించిన తరువాత న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
పారా మిలిటరీ దళాల మోహరింపు..
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు పారామిలిటరీ దళాలను మోహరించాలని జైన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. 2022 లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల అనంతర హింస తరువాత తాను దాఖలు చేసిన పెండింగ్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుందని కూడా ఆయన చెప్పారు.
హింసపై దర్యాప్తు చేయడానికి పారామిలిటరీ దళాలను మోహరించాలని, ముగ్గురు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
ఉత్తర బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసాత్మక సంఘటనల తరువాత హిందువుల ప్రాణభయంతో వెళ్లిపోవడాన్ని కూడా ఆయన తన పిటిషన్ లో ప్రస్తావించినట్లు జాతీయ మీడియా తెలియజేసింది.
నిషికాంత్ దూబే ఆగ్రహం..
‘‘దేశంలో మత యుద్దాలను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుంది’’ అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శలు గుప్పించిన తరువాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
సుప్రీంకోర్టు చట్టాలు చేయడం ప్రారంభిస్తే పార్లమెంట్, అసెంబ్లీలను మూసివేయాలని కూడా బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలు రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్రపతి కచ్చితంగా ఆమోదించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా కలకలం రేగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది భారత రాష్ట్రపతి అని, దేశంలో రాజ్యాంగ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులకు సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని ఆయన కీలకమైన మౌలిక ప్రశ్నలు లేవనెత్తారు. అయితే బీజేపీ ఈవ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని పేర్కొంది.
Read More
Next Story