‘‘టిబెటన్ల ఆధ్యాత్మిక వారసత్వ నాయకత్వం కొనసాగుతుంది’’
x
టిబెటన్ల ఆధ్యాత్మిక మత గురువు దలైలామా

‘‘టిబెటన్ల ఆధ్యాత్మిక వారసత్వ నాయకత్వం కొనసాగుతుంది’’

ఎక్స్ లో ప్రకటించిన దలైలామా, స్పందించిన చైనా.. తమ ఆమోదం ఉండాల్సిందే అని ప్రకటన


బౌద్ధ మత గురువు, ఆధ్యాత్మితక నాయకుడు దలైలామా తన మరణం తరువాత వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. దలైలామా 600 సంవత్సరాల నాటి సంప్రదాయం కొనసాగుతుందని ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా లామా అభిమానులు, టిబెటన్లలో, తమకు నాయకుడు లేకుండా పోతారనే ఆందోళనలు వస్తున్న క్రమంలో ఈ ప్రకటన వచ్చింది. దలైలామను అహింసకు చిహ్నంగా, చైనా పాలనలో టిబెటన్ సంస్కృతికి గుర్తింపు కోసం పోరాటానికి కేంద్రంగా భావిస్తారు.

బీజింగ్ ఆమోదం అవసరం..
దలైలామ ప్రకటనపై బుధవారం చైనా స్పందించింది. ఆధ్యాత్మిక గురువు పునర్జమ్మను చైనా ప్రభుత్వం మాత్రమే ఆమోదించగలదని, ఈ ప్రక్రియ దేశం లోపలే జరగాలని పేర్కొంది.
‘‘దలైలామా, పంచన్ లామా, ఇతర గొప్ప బౌద్ధ వ్యక్తుల పునర్జమ్మను బంగారు కలశం నుంచి చీటీలు వేయడం ద్వారా ఎంచుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఒక వార్తా సమావేశంలో చెప్పారు. నింగ్ 18 వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశ చక్రవర్తి ప్రవేశపెట్టిన ఈ ఆచారాన్ని ఆయన ప్రస్తావించారు.
‘‘చైనా ప్రభుత్వం మత విశ్వాస స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తుంది. కానీ మతపరమైన వ్యవహరాలు, టిబెటన్ సజీవ బుద్దుల పునర్జన్మను నిర్వహించడానికి అవలంబించే పద్దతులపై నిబంధనలు ఉన్నాయి’’ అని మావో అన్నారు.
దలైలామా ధృవీకరణ..
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. టెన్జిన్ గయాస్టో దలైలామ 14వ పునర్జన్మ. రాజధాని లాసాలో టిబెటన్ తిరుగుబాటు పై చైనా సైనిక అణచివేత తరువాత దలైలామా, అతని అనేకమంది అనుచరులు భారత్ లోని ప్రవేశించి శరణు వేడారు. దానితో వారికి గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఆశ్రయం లభించింది.
‘‘ముఖ్యంగా టిబెటన్లలోని టిబెటన్ల నుంచి ఇదే విజ్ఞప్తి వచ్చింది. ఈ అన్ని అభ్యర్థనలకు అనుగుణంగా దలైలామ సంస్థ కొనసాగుతుందని నేను ధృవీకరిస్తున్నాను. ’’ అని దలైలామా ఎక్స్ లో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.
జూలై 6న ఆయన 90 వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వయస్సు పెరగడం వల్ల వారసత్వ సమస్యపై టిబెటన్లలో ఆందోళనలు రేకెత్తాయి.
చైనా వ్యతిరేకత..
దలైలామా ను చైనా ఆది నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఆయనను తిరుగుబాటుదారుడిగా, వేర్పాటువాదిగా ముద్రవేసింది. చైనా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటే టిబెట్ పై తన పట్టును బిగించడానికి బీజింగ్ తన వారసుడిని ప్రకటిస్తుందనే ఆందోళనలు ఆయన అనుచరులలో ఉన్నాయి.
అయితే దలైలామా తన తాజా ప్రకటనలో గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ అని కూడా పిలువబడే తన కార్యాలయానికి మాత్రమే తన వారసుడిని ఎన్నుకునే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.
గాడెన్ ఫొడ్రాంగ్ ట్రస్ట్..
‘‘భవిష్యత్ లో పునర్జమ్మను గుర్తించే ఏకైక అధికారం గాడెన్ ఫొడ్రాంగ్ ట్రస్ట్ కు ఉందని నేను పునరుద్ఘాటిస్తున్నాను, ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికి లేదు’’ అని దలైలామా తెలిపారు.
‘‘భవిష్యత్ దలైలామను గుర్తించే ప్రక్రియ సెప్టెంబర్ 24, 2011 నాటి ప్రకటనలో స్పష్టంగా ప్రకటించారు. అలాచేయడానికి బాధ్యత దలైలామ కార్యాలయం అయిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ సభ్యులపై మాత్రమే ఉంటుందని పేర్కొంది’’ అని ఆయన చెప్పారు.
గడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల అధిపతులను, దలైలామాల వంశంతో విడదీయారాని విధంగా ముడిపడి ఉన్న విశ్వసనీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్న ధర్మ రక్షకులను సంప్రదించాలని ఆయన అన్నారు. ‘‘వీరు గత సంప్రదాయానికి అనుగుణంగా శోధన, గుర్తింపు విధానాలను అమలు చేయాలి’’ అని ఆయన అన్నారు.


Read More
Next Story