ఓటింగ్ కు ముందే ఆప్ ఓడిపోయింది: ప్రధాని
‘ఆప్- దా’ ప్రభుత్వం వల్ల ఢిల్లీ నాశనం అయిందని విమర్శలు
ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని, ఆ పార్టీ క్రమంగా పతనం వైపు దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహ పలువురు ఆప్ నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. చాలామంది సిట్టింగ్ లకు ఆప్ టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో వారంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ పార్టీని వీడుతున్నారు.
ప్రజల్లో ఉన్న ఆగ్రహం స్ఫష్టంగా కనిపిస్తోందని, అయితే రోజుకో తప్పుడు ప్రకటనలతో అది ప్రజలను తప్పుదోవ చేసే పట్టించే విధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ఉన్న మధ్య తరగతి అనుకూల బడ్జెట్ ను తాము ప్రవేశపెట్టామని, కేంద్ర బడ్జెట్ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపిందని ప్రధాని చెప్పారు.
తప్పుడు వాగ్థానాలు..
రాజధాని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తప్పుడు వాగ్ధానాలు, అవినీతికి పాల్పడిందని ప్రధాని నిప్పులు చెరిగారు. ప్రజలను లూటీ చేసిన వారు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తప్పుడు విధానాలు మాట్లాడిన ప్యాక్టరీలను మూసివేసేలా ప్రజలు చేస్తున్నారని అన్నారు. ఓ వైపు తప్పుడు విధానాల ‘ఆప్-దా’ ఉంటే మరో వైపు మోదీ విధానాలు ఉన్నాయని చెప్పారు. వసంత పంచమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ పండగ సీజన్ వాతావరణ మార్పును సూచిస్తుందని, ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ‘ఆప్ -దా’ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా దేశ రాజధానిని నాశనం చేసిందని, దేశ అభివృద్ధికి అంకితమైన డబుల్ ఇంజిన్ సర్కార్ ను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
శీశ్ మహాల్ తవ్వకాలు..
ఆప్ ప్రభుత్వం వలన ఢిల్లీ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారని, ఇప్పుడు దాని తొలగించుకోవాలని కూడా అనుకుంటున్నారని ప్రధాని చెప్పారు. ‘ శీశ్ మహాల్’ కట్టుకున్నవారు పేద కుటుంబానికి చెందిన వారితో ఎలాంటి సంబంధం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజల ఆరోగ్య రంగంతో సహా ప్రతి రంగంలోనూ ఆప్ కుంభకోణాలు, అవినీతికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు..
తాము అధికారంలోకి వస్తే ఏ ఇంటిని కూల్చబోమని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. పూర్వాంచల్ లోని ప్రజలకు చేరువయ్యాయని అన్న మోదీ, తాను ఈ ప్రాంతానికి చెందిన ఎంపీనని, వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాని పేర్కొన్నారు. బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పగలు, రాత్రి కృషి చేస్తోందని, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు బడ్జెట్ లో ప్రస్తావించామన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8 నాటికి రూ. 2,500 అందజేయడం ప్రారంభిస్తారని హమీ ఇచ్చారు. మహిళలను నాకు రక్షణ కవచంలా పనిచేశారని, కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమవంతు కృషి చేశారని అన్నారు.
Next Story