
రాహుల్ గాంధీ
ఎంఎస్ఎంఈలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోంది
రాహుల్ గాంధీ ఆరోపణ
కార్పోరేట్ సంస్థల లాభాల కోసం మోదీ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నాశనం చేస్తోందని, ద్వంద్వ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పగ్గాలను ఎంఎస్ఎంఈల చేతుల్లోకి తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
చిన్న మధ్య తరహ సంస్థల తయారీదారుల ప్రతినిధి బృందాన్ని కలిసిన తరువాత రాహుల్ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలను నాశనం చేయాలని నిశ్చయించుకుందని అన్నారు. బీజేపీకి నిధులు సమకూర్చడానికి మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గుత్తాధిపత్యాన్ని ప్రొత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం పెద్ద సంస్థలకు అనుకూలం..
గుత్తాధిపత్యం లేదా ద్వంద్వత్వం భారత్ కు శాపం. మోదీ ప్రభుత్వం ప్రతిరంగంలో ప్రతి పరిశ్రమలో సరిగ్గా ఇలాగే చేస్తోందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు తన వాట్సాప్ ఛానెల్ లో అన్నారు.
‘‘జన్ సంసద్ సందర్భంగా నేను చిన్న, మధ్య తరహా తయారీదారుల ప్రతినిధి బృందాన్ని కలిశాను. వారితో మాట్లాడటం, వారి సమస్యలను వినడం ద్వారా ప్రభుత్వం తన అనుకూల పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం చిన్న వ్యాపారాలను నాశనం చేయాలని నిశ్చయించుకుందని తెలిసింది’’ అని రాహుల్ అన్నారు.
దేశంలోని ఇటువంటి చిన్న వ్యాపారాలు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాయని, వారి కస్టమర్లు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారని ఆయన ఎత్తి చూపారు.
జీఎస్టీ కష్టంగా మారింది..
‘‘ఈ చిన్న వ్యాపారాలకు జీఎస్టీ చాలా క్లిష్టంగా మారింది. ఆ భారాన్ని మోయడం వారికి కష్టమవుతోంది. అందుకే చిన్న వ్యాపారాల కోసం ఒక ప్రత్యేక కంపోజిషన్ స్కీమ్ సృష్టించారు.
కానీ బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకం నుంచి మినహయించారు. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఫీజులను భారీగా పెంచాయి’’ అని ఆయన అన్నారు.
అధిక పన్నులు, పెరుగుతున్న కాగితపు పనులు, పెరుగుతున్న ఫీజుల దాడిని ఎదుర్కొంటున్న చిన్న మధ్య తరహ తయారీదారులు కుప్పకూలీపోతున్నారని, ఈ రోజుల్లో ఇండియా గేట్ వంటి పర్యాటక ప్రదేశాలలో కూడా వారు కనిపించడం లేదని రాహుల్ అన్నారు.
ప్రధాని అభిమాని గుత్తాధిపతులు..
ప్రతి రంగంలోనూ ఈ కథే వినపిస్తోంది. బీజేపీకి నిధులు సమకూర్చే ప్రధానమంత్రి అభిమాన గుత్తాధిపతులు మాత్రమే మనుగడ సాగిస్తున్నారు. దీనికి ప్రతిగా వారు మార్కెట్ పై గుత్తాధిపత్యాన్ని సాధిస్తున్నారని రాహుల్ విమర్శించారు.
‘‘మనం ఈ విష వలయాన్ని విచ్ఛిన్నం చేయాలి. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పగ్గాలను ఎంఎస్ఎంఈల చేతుల్లోకి తిరిగి తీసుకురావాలి. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రజలకు సరసమైన, నాణ్యమైన ఎంపికలు లభిస్తాయి. చిన్న వ్యాపారాలు దేశ పురోగతిలో సమాన భాగస్వాములుగా మారతాయి’’ అని రాహుల్ అన్నారు.
‘‘మీరు ప్రజలకు ఉద్యోగాలు సృష్టించాలంటే చిన్న, మధ్య తరహ వ్యాపారాలు దానిని చేయబోతున్నాయి. ప్రత్యేకంగా శ్రీ నరేంద్ర మోదీ చేసేది ఏమిటంటే.. ఈ ప్రజలను అణచివేయడానికి గుత్తాధిపత్యాలకు సహాయం చేయడం’’ అని రాహుల్ ఆరోపించారు.
భారత ఆర్థిక వ్యవస్థను గుత్తాధిపత్యాలు బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. గుత్తాధిపతులు ప్రాథమికంగా మార్కెట్ ను నాశనం చేస్తారని, వీరు అన్ని రంగాలపై నియంత్రణ సాధిస్తారని అన్నారు.
‘‘మోనోపాలి నిర్మించబడతాయని నరేంద్ర మోదీ హమీ ఇస్తున్నందుకు ఒక కారణం ఉంది. ఎందుకంటే బీజేపీకి నిధులు సమకూర్చడానికి అదే ఆయనకు సులభమైన మార్గం.
ఈ పేదలు వారికి ఆయనను సంప్రదించడానికి అవకాశం లేదు. ఆయన కార్యాలయాలకు కూడా ప్రవేశం లేదు. కాబట్టి వారు ప్రాథమికంగా బీజేపీకి ఆర్థిక సాయం చేయలేరు’’ అని ఆయన అన్నారు.
బీజేపీ ప్రతిరంగంలోనూ గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తోందని, వాటిలో అతిపెద్దవి అదానీ, అంబానీ అని రాహుల్ ఆరోపించారు. ‘‘ఇది దేశానికి ప్రమాదకరం, ఇది దేశ నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో భారతీయ యువకులు నిరుద్యోగులుగా ఉండేలా చేస్తుంది’’ అని రాహుల్ అన్నారు.
Next Story

