పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేయడం పై నిషేధం విధించిన స్పీకర్
ఎంపీల మధ్య పరస్పర తోపులాట, గాయాలు కావడంతో నిర్ణయం
పార్లమెంట్ లో నిన్న జరిగిన ఆందోళనలు అనూహ్యంగా తోపులాటకు దారి తీసి ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడంతో లోక్ సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి లోక్ సభ లోని ఎంపీల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల దగ్గర ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని నిషేధం విధించారు.
‘పార్లమెంట్ ప్రాంగణంలో ఇక ముందు రాజకీయ పార్టీలు గానీ, ఎంపీలు ఎవరూ ఆందోళన నిర్వహించడానికి వీలులేదని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు’ అని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా పేర్కొన్నాయి.
డా. బీఆర్ అంబేడ్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన దిగగా, కాంగ్రస్సే అంబేడ్కర్ అమానించిందంటూ అమిత్ షా ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా షాకు మద్ధతుగా ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా పార్లమెంట్ ప్రాంగణంలోనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగాయి.
ఆ నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలను తోసేశారు. అందులో మాజీమంత్రి ఒడిశా ఎంపీకి గాయాలు కాగా, ఫరూకాబాద్ ఎంపీ కిందపడిపోయారు. తనను పార్లమెంట్ లోపలికి వెళ్లడానికి అడ్డుకోవడంతో ఇలా జరిగిందని రాహుల్ గాంధీ జాతీయ మీడియాతో చెప్పారు.
రాహుల్ గాంధీ పై హత్యాయత్నం కేసు..
రాహుల్ గాంధీని మా ఎంపీలపై గూండాగిరీ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఆయన పై కేసు పెట్టింది. రాహుల్ పై బీఎన్ఎస్ లోని సెక్షన్ 117 కింద( ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం) కేసు నమోదు అయింది. అదే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాహుల్ తో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆందోళన కాస్త హింస వైపు..
ఉదయం లోక్ సభ ప్రారంభం కావడానికంటే ముందు అంబేడ్కర్ పై హోంమంత్రి అవమానించే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆందోళనలు ప్రారంభించగా, తరువాత బీజేపీ కూడా నిరసన చేసింది. ఈ సందర్భంగా ఇరు రాజకీయ పార్టీలు కూడా నినాదాలతో హోరెత్తించాయి. ఇరు పార్టీలు మాటలతో కవ్వించుకున్నాయి. తరువాత ఎంపీలు నిష్క్రమించే ద్వారం గుండా వెళ్లడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రాహుల్ గాంధీ ఇద్దరు బీజేపీ వృద్ద ఎంపీలపై దురుసుగా ప్రవర్తిస్తూ కిందకి తోసేశారని కమలం పార్టీ ఆరోపించింది. గాయపడిన ఎంపీలను కేంద్రమంత్రులు పరామర్శించారు.
అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై బీజేపీ దాడికి దిగిందని రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఆరోపించారు. ప్లకార్డుల కర్రలతో తమపై దాడి చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
Next Story