జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల స్కెచ్ లను విడుదల చేసిన భద్రతా దళాలు
x

జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల స్కెచ్ లను విడుదల చేసిన భద్రతా దళాలు

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద దాడులకు పాల్పడిన నలుగురి పాక్ టెర్రరిస్ట్ ల స్కెచ్ లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వారిని పట్టిస్తే రూ..


జమ్మూ కాశ్మీర్ పోలీసులు బుధవారం (జూన్ 12) దోడా జిల్లాలోని రెండు దాడుల్లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు. వారి సమాచారాన్ని అందజేసిన సమాచారం గోప్యంగా ఉంచడంతో పాటు బహుమతిగా రూ. 20 లక్షల నగదును ఇస్తామని ప్రకటించింది.

మంగళవారం (జూన్ 11) భదర్వాలోని చటర్‌గల్లా వద్ద 4 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల జాయింట్ చెక్ పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు, అలాగే గండో ప్రాంతంలో బుధవారం సెర్చ్ పార్టీపై దాడి చేశారు,ఇందులో ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు, వీరు భదేర్వా, థాత్రి, గండోహ్ ఎగువ ప్రాంతాల్లో నక్కి ఉన్నారని, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని భావిస్తున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
ఒక్కో ఉగ్రవాది గురించిన సమాచారం ఇచ్చిన వారికి ₹5 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ ఉగ్రవాదుల ఉనికి, కదలికల గురించి సమాచారం అందించాలని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రియాసి దాడి
మంగళవారం రాత్రి, రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. అతని గురించి సమాచారం ఇస్తే ₹20 లక్షల రివార్డును ఇస్తామని ప్రకటించారు.
ఆదివారం, పోనీ ప్రాంతంలోని టెర్యాత్ గ్రామ సమీపంలోని కత్రాలోని శివ ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలో కోల్పోయారు. 41 మంది భక్తులు గాయపడ్డారు. వీరంతా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన వారు.


Read More
Next Story