ఎర్రకోట పేలుడు: మరో వైద్యుడి ప్రమేయం ఉందా?
x
అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం

ఎర్రకోట పేలుడు: మరో వైద్యుడి ప్రమేయం ఉందా?

జేకే వైద్యుడు నిసార్ ఉల్ హసన్ పై దృష్టి సారించిన దర్యాప్తు సంస్థలు


ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు లో తవ్వుతున్న కొద్ది అనేక మంది వైద్యులు ఉన్నట్లు తేలుతోంది. 2023 లో జమ్మూకశ్మీర్ లో నుంచి తొలగించిన వైద్యుడు నిసార్ ఉల్ హసన్ లింక్ తాజాగా బయటపడింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సీ) కింద ఉగ్రవాద ఆరోపణలపై శ్రీనగర్ లోని ఎస్ హెచ్ఎంఎస్ ఆస్పత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి విధుల నుంచి తొలగించారు.

తరువాత ఫరీదాబాద్ అల్ ఫలాహ్ విశ్వ విద్యాలయంలో మెడిసిన్ విభాగంలో చేరినట్లు ప్రొఫెసర్ గా చేరినట్లు తెలుస్తోంది. నవంబర్ 10 న జరిగిన కారు బాంబు పేలుడు తరువాత డాక్టర్ హసన్ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీనితో దర్యాప్తు అధికారులకు నిందితుడిపై అనుమానం తలెత్తింది.

భద్రతా సంస్థల పరిశీలన..
జమ్మూకశ్మీర్ లోని వేర్పాటువాద రాజకీయాల పట్ల తనకున్న సానుభూతి కారణంగా డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ను విభేదాలు సృష్టించే వ్యక్తిగా చూశారు. వేర్పాటువాదుల పట్ల ఆయనకున్న అభిప్రాయం కారణంగా కశ్మీర్ డాక్టర్స్ అసోసియేషన్ లో ఆయన క్రియాశీలత, బహిరంగ ప్రకటనలతో భద్రతా సంస్థలు అతడిపై నిఘా పెట్టారు. హసన్ ను జేకే లెప్టినెంట్ గవర్నర్ టిక్కింగ్ బాంబ్ గా అభివర్ణించారు.
వైద్యుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న హసన్ అనేక సందర్భాలలో అధికారులతో ఘర్షణకు దిగాడు. జేకేలో నకిలీ డ్రగ్స్ కుంభకోణం తరువాత హురియత్ కాన్పరెన్స్ వంటి వేర్పాటువాద గ్రూపుల మద్దతుతో 2013 లో మే లో సమ్మెకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులు పన్ను చెల్లించడం మానేయాలని ఎన్నికల విధులను బహిష్కరించాలని, వేర్పాటువాద సంస్థలను బలోపేతం చేయాలని కోరినందుకు 2014 లో ఒమర్ అబ్ధుల్లా ప్రభుత్వం హసన్ ను సస్పెండ్ చేసింది.
నాలుగు సంవత్సరాల తరువాత 2018 లో ఆగష్టులో గవర్నర్ పాలనలో హసన్ తిరిగి ప్రభుత్వ సేవలలోకి తీసుకుంది. 2018 నుంచి 2023 వరకు అతను లో ప్రొఫైల్ ను కొనసాగించాడు. అయితే పాత కేసుల విషయంలో మరోసారి సస్పెండ్ అయ్యాడు.
దక్షిణ కశ్మీర్ స్థానికుడు..
డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కశ్మీర్ లోని సోపోర్ లోని అచాబల్ గ్రామానికి చెందినవాడు. 1991 లో శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ను పూర్తి చేశాడు. 2001 లో షేర్ ఏ కశ్మీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎండీ పూర్తి చేశాడు.
ఉమర్ నబీతో సంబంధాలు..
ఎర్రకోట బాంబు పేలుడు కుట్రకు ప్రధాన సూత్రధారి పేలి కారు డ్రైవర్ అయిన డాక్టర్ మహ్మద్ ఉమర్ నబీతో అతనికి ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమర్ నబీ అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేశారు.
అయితే హసన్ పరారీలో ఉన్నాడనే ప్రచారాన్ని ఆయన భార్య ఖండించింది. డాక్టర్ ను ఎన్ఐఏ దర్యాప్తులో తీసుకుందని చెప్పారు. తన భర్తకు ఉమర్ నబీతో ఉన్న సంబంధం దెబ్బతిన్నదని ఆమెతో ఇండియాటుడే తో అన్నారు. ఉమర్ తరుచుగా పనికి హజరుకాకపోవడంతో హసన్ తన చికాకు వ్యక్తం చేశారని దీని ఫలితంగా నబీ వేరే వార్డుకు మారారని పేర్కొన్నారు.


Read More
Next Story