
ఎర్రకోట పేలుడు: ఎన్ఐఏ కస్టడీలోకి కీలక నిందితుడు రషీద్
ఆత్మాహుతి పేలుడులో మాస్టర్ మైండ్ ఇతడే అంటున్నా దర్యాప్తు బృందాలు
ఎర్రకోట బాంబు పేలుడులో మాస్టర్ మైండ్ అమీర్ రషీద్ అలీని ఢిల్లీ కోర్టు పది రోజుల ఎన్ఐఏ కస్టడీకి పంపింది. ఈ రోజు ఉదయం పదకొండున్నరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పాటియాలా హౌజ్ కోర్టు సముదాయంలో అలీని న్యూఢిల్లీ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి అంజు బజాజ్ చంద్నా ముందు హాజరిపరిచారు.
విచారణ ప్రక్రియ అంతా కెమెరా ముందు జరిగిందని అందుకు మీడియాకు అనుమతి ఇవ్వలేదు. అలీని పది రోజుల పాటు తన కస్టడీలో విచారించేందుకు ఏజెన్సీ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి చందన అనుమతించారని కోర్టు వర్గాలు తెలిపాయి.
‘‘కోర్టు కాంప్లెక్స్ చుట్టుపక్కల ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు’’ అని ఒక పోలీస్ అధికారి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అల్లర్ల నిరోధక టీమ్ లు సిద్దంగా ఉంచామని తెలిపారు.
ఈ కేసులో జమ్మూకశ్మీర్ లోని దక్షిణ కశ్మీర్ నివాసి అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్ నబీ తో కలిసి ఆత్మాహుతి దాడి చేయడానికి దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నాడని ఆరోపణలు ఉన్నాయి. పేలుడుకు పాల్పడిన కారును తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నా అలీ ఢిల్లీలో పట్టుబడ్డాడు.
ఆత్మాహుతిదాడికి అవసరమైన కారు కొనుగోలు చేసేందుకు అలీ ఢిల్లీకి వచ్చాడని, ఆ కారులో ఐఈడీ పేల్చి 15 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన నబీ కారు నడుపుతున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి కేంద్రంగా ఉన్నా వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నాయి.

