
‘‘రాజా రఘువంశీని భార్యే హత్య చేయించింది’’
చార్జీషీట్ లో వెల్లడించిన మేఘాలయ పోలీసులు
ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు శనివారం చార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన భార్య సోనమ్ సమక్షంలోనే హత్యకు గురయ్యారని ఆరోపించారు.
మేఘాలయలో హనీమూన్ సందర్భంగా తన భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి సోనమ్ తాను ప్రేమలో ఉన్న రాజ్ కుష్వాహాతో కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ హత్య చేయడానికి సోనమ్, రాజ్ ముగ్గురు హంతకులకు సుపారి ఇచ్చాడు. మేఘాలయలోని జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ సోహ్రా సబ్ డివిజన్ కోర్టు ముందు దాఖలు చేసిన ఛార్జిషీట్, 29 ఏళ్ల వ్యాపారవేత్త హత్యకు సంబంధించిన కుట్ర, అతని హత్య గురించి వివరాలను వెల్లడించింది.
నిందితుడి అరెస్ట్
సోహ్రాలోని వీ సావ్ డాంగ్ జలపాతాల క్రింద ఉన్న లోయలో బాధితుడి మృతదేహం దొరికింది. కొన్ని రోజుల తరువాత జూన్ రెండోవారంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి సోనమ్ రాజ్ తో సహ ఐదుగురిని మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులు అయిన విశాల్ సింగ్ చౌహన్, ఆనంద్ కుర్మీ, ఆకాశ్ సింగ్ రాజ్ పుత్ లను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు నాశనం చేశారనే ఆరోపణలతో పోలీసులు తరువాత మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1), 238(ఏ), 61(2) భారత న్యాయ నియమావళి కింద అభియోగాలు మోపారు.
క్రైమ్ సీన్ రీ కన్ స్ట్రక్షన్..
నేరాన్ని ఎలా జరిగిందనే పోలీసులు క్రైమ్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. బాధితుడు రాజా రఘువంశీని మొదటి కిరాయి హంతకుడు చౌహన్ కొడవలితో దాడి చేశాడు. ఈసమయంలో పక్కనే సోనమ్ పక్కనే ఉంది.
రాజాకు రక్తస్రావం కావడంతో కేకలు వేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో సోనమ్ అక్కడి నుంచి పారిపోయింది. భర్త మరణించిన తరువాత మళ్లీ అక్కడికి వచ్చి చనిపోయినట్లు నిర్థారించుకుంది.
రఘు వంశీ మృతదేహం దొరికిన చోటు మరొక వ్యక్తి అంగీ, కొడవలి దొరికింది. జంట హోటల్ నుంచి బయటకు వచ్చిన క్షణం, నిందితులు, గైడ్ తో సహ చాలా మంది ప్రత్యక్ష సాక్ష్యాలతో పాటు, సీసీ టీవీ ఫుటేజ్ సైతం తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
హోటల్ బ్యాగుల నుంచి సోనమ్ మంగళ సూత్రం, కాలి ఉంగరం స్వాధీనం చేసుకున్నామని, ఇది పోలీసుల మనస్సులో అనుమానం రేకెత్తించడానికి కారణమైందని తెలిపారు.
హత్య చేయించింది..
అన్ని ఆధారాలను సేకరించి, క్రోడికరించడంతో సహ సమగ్ర దర్యాప్తు నిర్వహించిన తరువాత సోనమ్ రఘువంశీకి రాజ్ కుష్వాహాతో సంబంధం ఉందని సోహ్రాకు హనీమూన్ నెపంతో రాజా రఘువంశీని హత్య చేయడానికి వారిద్దరూ ముగ్గురు దుండగులు నేరపూరిత కుట్ర పన్నారని నిశ్చయంగా రుజువైందని మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏడాది మే 23న రాజా, సోనమ్ తమ హనీమూన్ సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడూ కనిపించకుండా పోయినందున ఈ కేసును మొదట మిస్సింగ్ కేసుగా పరిగణించారు. తలపై రెండు పదునైన కోతలతో రాజా మృతదేహం కనుగొనబడిన తరువాత మాత్రమే హత్య దర్యాప్తుగా మారింది.
Next Story