‘సర్’ ను మరోసారి వ్యతిరేకించిన రాహుల్ గాంధీ
x
రాహుల్ గాంధీ

‘సర్’ ను మరోసారి వ్యతిరేకించిన రాహుల్ గాంధీ

ఓట్ చోరీ వ్యవస్థీకృతం చేయడానికి ఈ ప్రక్రియ అంటూ విమర్శలు


ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ లేదా సర్) పై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓట్ చోరీని సంస్థాగతం చేయడానికే ‘సర్’ ను నిర్వహిస్తున్నారని మరోసారి ఆరోపణలు చేశారు.

హర్యానా మాదిరిగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలో కూడా ఓట్ల చోరి జరిగిందని తాను నమ్ముతున్నానని రాహుల్ అన్నారు. ‘‘ఓట్ల దొంగతనం ఒక సమస్య, ఇప్పుడు సర్ దానిని కప్పిపుచ్చడానికి సంస్థాగతీకరిస్తున్నారు’’ అని కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అనధికార అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనడానికి గాంధీ శనివారం నర్మదాపురంలోని ‘పచ్ మర్హి’ కొండ పట్టణానికి వచ్చారు.

నవంబర్ 4న తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రారంభించింది. ఈ ప్రక్రియలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 51 కోట్ల ఓటర్లు పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దాని నేతృత్వంలోని ఇండి కూటమి వ్యతిరేకిస్తోంది.
‘‘కొన్ని రోజుల క్రితం నేను హర్యానాపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. ఓట్ల దొంగతనం జరుగుతున్నట్లు నేను స్పష్టంగా చూశాను. 25 లక్షల ఓట్ల చోరీ చేశారు. ప్రతి ఎనిమిది ఓట్లలో 1 ఓటు చోరి చేశారు’’ అని గాంధీ ఆరోపించారు.
డేటాను పరిశీలించిన తరువాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలో కూడా అదే జరిగిందని నేను నమ్ముతున్నాను. ఇది బీజేపీ ఎన్నికల సంఘం(ఎన్నికల సంఘం) వ్యవస్థ’’ అని ఆయన ఆరోపించారు.
‘‘మా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని మేము క్రమంగా అందిస్తాము. కానీ నా సమస్య ఓటు చోటు గురించి. ఇప్పుడు సర్ దానిని కప్పిపుచ్చడం వ్యవస్థను సంస్థాగతీకరించడం గురించి’’ అని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని వివరాలను వెల్లడిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, చాలా సమాచారం ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం కొద్ది సమాచారం మాత్రమే బయట పెట్టామని అన్నారు.
ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జట్టుకట్టి నేరుగా దేశంపై దాడికి దిగుతున్నారు. వీరి కారణంగా దేశం నష్టపోతోంది. భారత మాతకు హాని జరుగుతోందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు.
సర్ కోసం ఏర్పాట్లు..
సర్ కోసం 5.3 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ) 10,448 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 321 జిల్లా ఎన్నికల అధికారులను రంగంలోకి దింపింది. అంతేకాకుండా రాజకీయ పార్టీల 7.64 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్ఏ) కూడా బీఎల్ఓ లకు సహాయం చేయడానికి రంగంలోకి దిగారు.
డిసెంబర్ 9న ఎన్నికల ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఎన్నికలలో రాహుల్ గాంధీ ఓట్ చోరి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఓటర్ల జాబితాను రివైజ్ చేస్తుంటే ఇప్పుడు మరోసారి ఆరోపణలు చేస్తున్నారని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలలో ఓట్ చోరీ జరిగిందని గాంధీ ఆరోపిస్తున్నారు. 25 లక్షల ఎంట్రీలు నకిలీవని ఎన్నికల కమిషన్ బీజేపీ విజయాన్ని ఖరారు చేయడానికి కుట్ర పన్నిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదును దాఖలు చేయలేదు. కొన్ని రోజులకు జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలోనూ ఇలాగే ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ ప్రజంటేషన్ ద్వారా కూడా ఇవే ఆరోపణలు చేశారు.
దీనిపై ఈసీ స్పందించింది. రాహుల్ గాంధీ దీనిపై అఫిడవిట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది. కానీ ఆయన ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదును ఈసీకి అందించలేదు. సుప్రీంకోర్టు కూడా దీనిపై కేసు తీసుకోవడానికి నిరాకరించింది. రాజకీయ ఆరోపణలకు కోర్టుకు వాడుకోరాదంటూ హెచ్చరించింది.


Read More
Next Story