పాక్ కేవలం దేశంలోని సిక్కులే లక్ష్యంగా దాడులు చేస్తోంది: భారత్
x
దాడికి గురైన తన ఇంటిని చూపెడుతున్న బాధితుడు

పాక్ కేవలం దేశంలోని సిక్కులే లక్ష్యంగా దాడులు చేస్తోంది: భారత్

విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి


దాయాదీ దేశం పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్ లోని సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని, పూంచ్ లో ఉన్న గురుద్వారాపై షెల్లింగ్ చేస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

జమ్మూకాశ్మీర్ లోని నాలుగు సెక్టార్లలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు కొనసాగించిందని, దీనికి భారత సైన్యం తగిన విధంగా స్పందించిందని అధికారులు తెలిపారు.
పహల్గామ్ దాడి తరువాత తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో గురువారం జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దుల్లో వరుసగా 14 రోజు రాత్రి కాల్పులు జరిగాయి.
ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మందిని పర్యాటకులు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాక్ ప్రధాన భూభాగంతో పాటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ సైనిక చర్యకు దిగింది.
ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. పూంచ్ లో 16 మంది పౌరులు మరణించారని, అనేక మంది గాయపడ్డారని చెప్పారు.
‘‘నిన్న పాకిస్తాన్, జమ్మూకాశ్మీర్ లోని సిక్కు సమాజం లక్ష్యంగా దాడి చేసింది. ఫూంచ్ లోని ఒక గురుద్వారాపై దాడి చేసి, దాడికి గురైన సిక్కు సమాజ సభ్యులపై దాడి చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పూంచ్ లో మొత్తం `16 మంది పౌరులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని మిస్త్రీ తెలిపారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడితో పరిస్థితి మరింత దిగజారిందని, భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుందని, పాకిస్తాన్ మాత్రం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగిందని, అందువల్ల ఉద్రిక్తతను తగ్గించే ఎంపిక పాకిస్తాన్ చేతిలో ఉందన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడితో పాకిస్తాన్ వైపు ప్రారంభమైందని మిస్త్రీ అన్నారు. ‘‘మా విధానం పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడం కాదు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడికి మాత్రమే మేము స్పందించాము’’ అని ఆయన అన్నారు.
పరిస్థితి తీవ్రతరం కావడంపై మిస్త్రీ మాట్లాడుతూ..పాకిస్తాన్ పరిస్థితిని తీవ్రతరం చేసిందని, మేము స్పందించడం మాత్రమే చేస్తున్నామని, ఏదీ కావాలో అది పాకిస్తాన్ చేతిలో మాత్రమే ఉందన్నారు.
పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ పాత్ర గురించి యూఎన్సీలో ప్రస్తావించడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించిందని ఆయన అన్నారు.


Read More
Next Story