ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్ష కానున్నాయా?
x

ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్ష కానున్నాయా?

ఎన్నికల సంఘం శుక్రవారం హర్యానా, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక్కడ స్థానిక పరిస్థితులు అన్ని..


(జ్ణాన్ వర్మ)

జమ్మూ కాశ్మీర్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన అధికార బిజెపికి అగ్ని పరీక్షగా మారనుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక విధాన నిర్ణయాలపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపై ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్టికల్ 370 రద్దు, దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, హర్యానాలో ఎన్నికలు బిజెపికి కీలకం, ఎందుకంటే రాష్ట్రంలో రైతు నిరసనలకు, చట్టబద్ధమైన డిమాండ్‌కు కేంద్రంగా ఉంది. ఇక్కడి రైతులు కనీస మద్దతు ధర (MSP) హమీ కోసం పోరాటాలు చేస్తున్నారు.
హర్యానాలో కష్టకాలం
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురైంది. హర్యానాలోని ఉన్న మొత్తం పది ఎంపీ స్థానాల్లో బీజేపీ 5 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకున్నాయి. 2014 తరువాత బీజేపీకి సీట్లు తగ్గడం ఇదే మొదటిసారి. ఇది బలహీనపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
“జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి ఆధిపత్య పాత్ర పోషిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు ఎన్నికలపై ప్రభావం చూపదు. లోక్‌సభ ఎన్నికలలో లాగానే ప్రజలు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని బిజెపి విశ్వసిస్తోంది. బీజేపీతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ ఎన్నికల్లో మేము బాగా రాణిస్తామని విశ్వసిస్తున్నాము, ” అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ఆర్‌పి సింగ్ ది ఫెడరల్‌తో అన్నారు.
హర్యానాలో ఇప్పటికే బీజేపీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చిలో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి నుంచి వైదొలగిన తర్వాత బిజెపి ప్రభుత్వానికి తగినంత మెజారీటీ లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీలో ఉంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్కంఠ
తదనంతరం, పార్టీ రాష్ట్ర శాఖలో అంతర్గత విభేదాల కారణంగా నయాబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు. దీనితో మనోహర్ లాల్ ఖట్టర్ మాజీకాక తప్పలేదు. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రివర్గంలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్టీ రాజకీయ అదృష్టాన్ని సైనీ పునరుద్ధరించగలరని బిజెపి భావించింది, కానీ అది జరగలేదు. రాష్ట్రంలోని 10 లోక్‌సభ స్థానాల్లో పార్టీ కేవలం ఐదు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. పైగా, జాట్ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఓడిపోయింది.
“రైతు నిరసనల తర్వాత కూడా, హర్యానాలో బీజేపీ ఇప్పటికీ అతిపెద్ద పార్టీగా ఉంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ కొన్ని సీట్లు కోల్పోయిన మాట వాస్తవమే కానీ ఇవి అసెంబ్లీ ఎన్నికలు. వ్యవసాయ నిరసనలు మా ఎన్నికల అవకాశాలను దెబ్బతీయవని, హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధిస్తామని మేము విశ్వసిస్తున్నాం” అని సింగ్ నమ్మకంగా చెబుతున్నారు.
రైతు నిరసనలు బీజేపీని..
అయితే, ముఖ్యమంత్రి సైనీ ఎలాంటి అవకాశాలను తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు, రాష్ట్ర ప్రభుత్వం MSPపై మరో 10 పంటలను కొనుగోలు చేస్తుందని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 2,000 బోనస్ ఇస్తామని సైనీ ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని రైతు నిరసనలు వెంటాడుతూనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “2019 సార్వత్రిక ఎన్నికలలో, బిజెపి మొత్తం 10 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది, అయితే అది రాష్ట్రంలో సొంతంగా మెజారిటీని పొందలేకపోయింది.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 46 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించగా, ఈసారి 10 స్థానాలకు గాను బీజేపీ కేవలం 5 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురుకానుంది” అని కర్నాల్‌లోని ద్యాల్ సింగ్ కాలేజీ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి కుశాల్ పాల్ ది ఫెడరల్‌తో అన్నారు.
J&Kలో రాష్ట్ర హోదా కోసం డిమాండ్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కానందున ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది.
కశ్మీర్ లోయలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని బీజేపీ నాయకత్వం నిర్ణయించినప్పటికీ, కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ విశ్వసిస్తోంది.
బీజేపీ ఎన్నికల పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం జమ్మూకశ్మీర్‌లో ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్ర హోదా డిమాండ్ కేవలం కాశ్మీర్‌కే పరిమితం కాకుండా బలమైన ప్రాంతీయ శక్తులకు వ్యతిరేకంగా పోటీ చేయడం బిజెపి నాయకత్వానికి సవాలు. జమ్మూ ప్రాంతంలో బీజేపీకి బలమైన మద్ధతుదారులుగా ఉన్న ప్రజలు కూడా ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు.
“జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా (UT) చేసిన తర్వాత ఇది మొదటి ఎన్నికలు. ఈ ఎన్నికలలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ అతిపెద్ద సమస్య అని మేము సులభంగా చెప్పగలం. రాష్ట్ర హోదా డిమాండ్ కాశ్మీర్‌లోనే కాకుండా జమ్మూలో కూడా ప్రతిధ్వనిస్తోంది.
జమ్మూలోని కొన్ని ప్రాంతాలలో బిజెపి ఆధిపత్య పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే జమ్మూ పట్టణ ప్రాంతాలలో కూడా రాష్ట్ర హోదాను డిమాండ్ చేయడానికి ప్రజలు ముందుకు వచ్చారు. బీజేపీకి ఇది అంత తేలికైన ఎన్నికలు కాదు” అని జమ్మూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఎల్లోరా పూరి ఫెడరల్‌తో అన్నారు.
Read More
Next Story