మనదేశానికి చెందిన గ్యాంగే హిండెన్ బర్గ్ వెనక ఉంది: కేంద్రమంత్రి
x

మనదేశానికి చెందిన గ్యాంగే హిండెన్ బర్గ్ వెనక ఉంది: కేంద్రమంత్రి

హిండెన్ బర్గ్ నివేదిక వెనక దేశానికి సంబంధించిన ఓ గ్యాంగ్ ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. విదేశాలతో చేతులు కలిపి దేశపు పరువు తీయడమే వారి లక్ష్యమని


సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తప్పుడు కథనాలతో దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి పడేయాలని చూస్తున్న సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయంపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ పరువు తీయడానికి కాంగ్రెస్ పార్టీ అమెరికా కు చెందిన షార్ట్ సెల్లర్ కంపెనీతో పొత్తు పెట్టుకుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిండెన్‌బర్గ్ శనివారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధబి బుచ్‌కి వ్యతిరేకంగా ఓ నివేదికను విడుదల చేసింది. అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్‌షోర్ నిధులలో ఆమెకు, ఆమె భర్త ధవల్‌కు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అయితే వీటిని వారు ఖండించారు. మా ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం అని ప్రకటించారు. మరో వైపు అదానీ గ్రూపు సైతం ఈ ఆరోపణలను ఖండించింది.
తాజా ఆరోపణలను దురుద్దేశపూరితమైనదని, ఎంపిక చేసిన పబ్లిక్ సమాచారాన్ని తారుమారు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్యనించింది. సెబీ చైర్‌పర్సన్ లేదా ఆమె భర్తతో తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని కంపెనీ పేర్కొంది.
దేశం పరువు తీయడమే లక్ష్యం..
రాజధానిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ఇది దేశం పరువు తీసే గ్యాంగ్, రాహుల్ (గాంధీ), జైరాం రమేష్. హిండెన్‌బర్గ్ తో చేతులు కలిపి మన పరువు తీయాలని చూస్తున్నారు. దేశానికి జరిగిన ఈ అవమానాన్ని మేము సహించము. ఇలాంటి వ్యక్తులు దేశానికి శత్రువులు. ఇప్పుడు హిండెన్‌బర్గ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం." సింగ్ అన్నారు.
రాహుల్‌ను 'బడే బాప్ కా బేటా' అని సంబోధించిన మంత్రి "రాహుల్‌కు దేశం స్థితి, దిశ గురించి ఏమీ తెలియదు" దేశంలో గందరగోళం, భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించే వారి పట్ల దేశప్రజలు "జాగ్రత్త"గా ఉండాలని అని హెచ్చరించారు. హిండెన్‌బర్గ్ వ్యవహారంలో JPC విచారణకు కాంగ్రెస్ డిమాండ్ పై స్పందించాలని కోరాగా.. "ఈ కాంగ్రెస్ హిండెన్‌బర్గ్ వెనుక ఉంది. హిండెన్‌బర్గ్ దేశాన్ని నాశనం చేయడానికి ఒక టూల్ కిట్, రాహుల్ గాంధీ వంటి వ్యక్తులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు".
జేపీసీ విచారణకు డిమాండ్‌
హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధాబి బుచ్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం డిమాండ్ చేశారు.
హిండెన్‌బర్గ్ చేసిన తాజా ఆరోపణల తర్వాత భారతదేశ స్టాక్ మార్కెట్ సమగ్రతకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు కూడా దేశం పరువు తీస్తారు.. స్వదేశంలో ఉన్నప్పుడు ఆయన (రాహుల్) దేశప్రజల్లో అయోమయం, భయాందోళనలు సృష్టిస్తారు.. ఇలాంటి వారి పట్ల దేశప్రజలు జాగ్రత్త వహించాలి.. గందరగోళం సృష్టించడం దేశ వ్యతిరేకులు చేసే చర్య. ఇది సరికాదు, దేశభక్తులెవరూ అలాంటి పని చేయలేరు" అని సింగ్ అన్నారు.


Read More
Next Story