బ్రిగేడ్లు, పోర్టులపై దాడి జరగలేదు: రక్షణ శాఖ
x
నకిలీ వార్తల లోగో

బ్రిగేడ్లు, పోర్టులపై దాడి జరగలేదు: రక్షణ శాఖ

ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడించిన పీఐబీ


జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ ఆర్మీ బ్రిగేడ్ పై, గుజరాత్ లోని హజీరా ఓడరేవుపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం తప్పుడిదని ప్రభుత్వం ఖండించింది. ఇదే సందర్భంగా నిన్న రాత్రి పాక్ చేసిన దుస్సాహానికి భారీ మూల్యం చెల్లించుకుంది. నిన్న ఉదయం నుంచి భారత్ లోని 15 నగరాలే లక్ష్యంగా పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సాయుధ దళాలు కూల్చివేశాయి.

జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్, ఉత్తర్ లై, భుజ్ లతో సహ తన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను గురువారం డ్రోన్లు, క్షిపణులతో భారత్ అడ్డుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ దాడుల్లో భారత్ కు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది.
ప్రెస్ ఇన్మర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుదారి పట్టించే, తప్పుడు వాదనలను గుర్తించి వాటిని తోసిపుచ్చింది. వీటిలో చాలా వరకూ పాకిస్తాన్ హ్యండిల్స్ నుంచి హిందువుల పేర్లతో ఉన్నట్లు గుర్తించి వాటిని నిలిపివేసింది.
జమ్మూ అండ్ రాజౌరీలో ఆత్మాహుతి దాడి..
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో ఆర్మీ బ్రిగేడ్ పై ఆత్మాహుతి దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసిన ఆరోపణలను నకిలీ వార్తలని ప్రభుత్వం తెలియజేసింది. జమ్మూకాశ్మీర్ లోని ఏ ఆర్మీ కంటోన్మెంట్ పైనా ఫిదాయిన్ లేదా ఆత్మాహుడి దాడి జరగలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.
జలంధర్ లో డ్రోన్ దాడి..
జలంధర్ లో జరిగిన డ్రోన్ దాడికి సంబంధించినదిగా చెప్పుకునే వీడియో వాస్తవానికి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించినది. వైమానిక దాడులు జరగడానికి ముందు జరిగిన అగ్ని ప్రమాదం అని రాత్రి 7.39 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించిందని, ఆ వీడియో అప్పటిదే అని పీఐబీ వెల్లడించింది.
జలంధర్ డిప్యూటీ కమిషనర్ ఎక్స్ లో ‘‘జలంధర్ లో రాత్రి 11.20 గంటలకు డ్రోన్ లను కూల్చివేశారు’’ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పోస్ట్ చేశారు.
గుజరాత్ లోనూ తప్పుడు ప్రచారం..
గుజరాత్ లోని హజీరా ఓడరేవుపై దాడి జరిగిందనే వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇది ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించినదని, అది కూడా జూలై 7, 2021 నాటిదని పీఐబీ ప్యాక్ట్ చెక్ యూనిట్ పేర్కొంది.
భారత సైనిక స్థావరం ధ్వంసం..
జమ్మూలోని ఓ బెటాలియన్ ను పాకిస్తాన్ ధ్వంసం చేసిందని ఆరోపిస్తున్న వీడియో కూడా అబద్దం అని తేలింది. పాకిస్తాన్ సైన్యం, ఒక ఇండియన్ పోస్ట్ ను ధ్వంసం చేసిందని ఆరోపిస్తూ పాకిస్తాన్ హ్యాండిల్స్ నకిలీ వీడియోలను ప్రచారం చేస్తున్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది.

పాకిస్తాన్, భారత్ పై ప్రతీకారంగా ఓ క్షిపణిని ప్రయోగించిందని పాత వీడియో ఒకటి షేర్ అవుతోంది. అయితే ఈ వీడియో 2020 లో బీరూట్ జరిగిన పేలుడు వీడియో అని తేలింది. అలాగే దేశంలోని అన్ని విమానాశ్రాయలు మూసివేసినట్లు వస్తున్న పోస్టులను సైతం తప్పుడు సమాచారం అని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ధృవీకరించింది.


Read More
Next Story