
ఎలక్ట్రిక్ బస్సులు జెండా ఊపి ప్రారంభిస్తున్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీలో కొత్త నిబంధన
నో పీయూసీ, నో ఫ్యూయల్ నిబంధన వర్తింపు
ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ‘నో పీయూసీ, నో ఫ్యూయల్’ పేరిట పెట్రోల్ బంక్ లకు ఆదేశాలు జారీ చేసింది. వాహానాలను పరిశీలించి కాలుష్యం లేదని నిర్ధారించుకునే పీయూసీ సర్టిఫికెట్ చూశాకే పెట్రోల్ పోయాలని సీఎం రేఖా గుప్తా ఆదేశించింది. ప్రజలకు ఈ నిర్ణయం బాధ కలిగించిన కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి మార్గాలు తప్పవని అన్నారు.
‘‘ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ ఢిల్లీలో నడుస్తున్న ప్రతి వాహానం కాలుష్యం కలిగించకుండా నడవాలి. మన వాహానాలకు పీయూసీ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవడం మన సమష్టి నైతిక బాధ్యత’’ అని ఆమె అన్నారు.
కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారమని ఆమె అన్నారు. ఒంటరి ప్రయాణానికి ప్రయివేట్ వాహానాలను ఉపయోగించకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్ పూలింగ్, ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలి. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కీలకం’’ అని ఆమె అన్నారు.
దేశ రాజధానిలో కాలుష్య పరీక్ష సదుపాయాలను ప్రభుత్వం విస్తరిస్తోందని గుప్తా అన్నారు. ఢిల్లీలో పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేసే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు.
ప్రజా రవాణా సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి ప్రశంసించారు. డ్రైవర్లు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తారని నగరంలో క్షీణిస్తున్న పర్యావరణ పరిస్థితిని మెరుగుపరచడానికి అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని ధౌలా కువాన్- ధరుహెరా మధ్య వంద ఎలక్ట్రానిక్ బస్సులను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
‘‘గత ప్రభుత్వ హయాంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేశారు. వాటి పునరుద్దరణతో ప్రాంతీయ కనెక్టీవిటీ బలోపేతం అవుతుంది. సోనిపట్, బరౌత్, ఇప్పుడు ధరుహెరాకు సేవలు ఈ ప్రయత్నంలో భాగమే’’ అని ఆమె అన్నారు.
కొత్త బస్సుల చేరికతో మొత్తం బస్సుల సంఖ్య 3,400కు పెరిగింది. గుప్తా మాట్లాడుతూ.. ‘‘3,400 బస్సులు ఎలక్ట్రిక్, మొత్తం ప్రజా రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్ గా మార్చే లక్ష్యంతో వచ్చే ఏడాది ఈ బస్సులను క్రమంగా విస్తరిస్తాము’’ ప్రతి బస్సులో టికెట్లను కొనుగోలు చేసే బదులు మహిళల కోసం పింక్ కార్డులను ప్రవేశపెడతాం’’ అని ప్రకటించారు.
వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలలో భాగంగా గురువారం నుంచి దేశ రాజధానిలో బీఎస్-6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఢిల్లీకి చెందని ప్రయివేట్ వాహానాల ప్రవేశంపై నిషేధం, నో పీయూసీ, నో ప్యూయల్ నిబంధన అమలులోకి తీసుకొచ్చారు.
Next Story

