
డీజీపీ నళిన్ ప్రభాత్
నౌగామ్ పేలుడు దురదృష్టవశాత్తూ జరిగిందే: జేకే పోలీస్ చీఫ్
ఎలాంటి విధ్వంసక చర్య లేదన్నా నళిన్ ప్రభాత్
జమ్మూకశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 32 మంది గాయపడినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ నళిన్ ప్రభాత్ శనివారం తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పారు.
‘‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’’ కేసులో దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి నౌగామ్ పోలీస్ స్టేషన్ కు రవాణా చేశారు. ఆ ప్రాంగణంలోని బహిరంగ ప్రదేశంలో భద్రంగా ఉంచినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రభాత్ తెలిపారు.
‘‘నిర్ధేశించిన విధానంలో భాగంగా, రికవరీ నమూనాలను ఫోరెన్సిక్, రసాయన పరీక్ష కోసం ల్యాబ్ పంపించాము. ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం గత రెండు రోజులుగా ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది’’ అని ప్రభాత్ అన్నారు.
రికవరీ సున్నితంగా ఉండటం వల్ల ఎఫ్ఎస్ఎల్ బృందం నమూనా సేకరణ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్న రాత్రి 11.20 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.
ఈ సంఘటనకు గల కారణాలు ఇతర ఊహగానాలు అవసరం లేదు’’ అని ఆయన అన్నారు. ఈ పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నత అధికారులు తెలిపారు.
ఈ సంఘటనలో 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు పక్కనే ఉన్న ముగ్గురు పౌరులు గాయపడ్డారని అన్నారు. ఈ దు:ఖ సమయంలో మృతుల కుటుంబాలను పోలీసులు సంఘీభావం తెలుపుతున్నారని డీజీపీ అన్నారు.
Next Story

