మధ్యప్రదేశ్ విదిశలో మాజీ ‘మామ’ మ్యాజిక్ ఎలా పని చేస్తుంది?
x

మధ్యప్రదేశ్ విదిశలో మాజీ ‘మామ’ మ్యాజిక్ ఎలా పని చేస్తుంది?

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అందరికి మామగా చిరపరచితుడైన శివరాజ్ సింగ్ చౌహన్ ఇప్పుడు విదిశ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే..


మధ్య ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమరంలో అందరి కళ్లు ఒక సీటుపైనే ఉన్నాయి. అదే విదిశ. ఒకప్పుడు బీజేపీ అగ్రనాయకుడు వాజ్ పేయ్, తరువాత సుష్మాస్వరాజ్ ఇక్కడ నుంచే ఎంపిక ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇదే స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పోటీ చేస్తున్నారు.

" ఇక్కడ కేవలం మామ మాత్రమే గెలుస్తారు. శర్మ మీరు రెస్ట్ తీసుకోండి " అని మధ్య ప్రదేశ్ లోని విదిశ ఎన్నికల ప్రచారంలో మెకానిక్ హరిరామ్ పటేల్ చెప్పిన మాట. ఆయన వయస్సు 77 ఏళ్లు. ఇక్కడ మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రతాప్ భాను శర్మ బరిలోకి దిగారు.

ప్రత్యర్థి పోరుగడ్డ?
జన సంపర్క్ లో భాగంగా కార్యకర్తలతో ముందుకు నడుస్తున్న శర్మ.. తాను లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తానని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ చివరిగా 1980 వ దశకంలో గెలిచింది. ఈ సారి ఆ రికార్డును తన పేరుపై నమోదు చేసుకుంటానని శర్మ అన్నారు. కానీ ఇక్కడ 1000 శాతం ఇక్కడ చౌహన్ గెలుస్తారని హరిరామ్ అన్నారు. ఉమాభారతి అనాలోచిత నిష్క్రమణ తర్వాత 2005 నవంబర్‌లో బిజెపి కేంద్ర నాయకత్వం ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది.
విదిశలో చౌహాన్ ఎలా..
1991లో, చౌహాన్ 32 సంవత్సరాల వయస్సులో విదిశ నుంచి లోక్‌సభ ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన బుద్ని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత ఆయన అదృష్టం బాగుంది. బీజేపీ అగ్ర నాయకుడు వాజ్ పేయ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో, మధ్యప్రదేశ్ లోని విదిశ నుంచి గెలుపొందారు. తరువాత ఆయన విదిశ సీటు వదులుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ ఉప ఎన్నిక రావడంతో ఆర్ఎస్ఎస్ నేత కుషాభౌ శివరాజ్ సింగ్ చౌహన్ ను నిలబెట్టాలని పార్టీపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అలా మొదటిసారిగా భానుశర్మ, చౌహన్ ప్రత్యర్థిగా మారారు. ఆ తరువాత మళ్లీ ఇద్దరు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
1991లో శర్మపై ఆశ్చర్యకరమైన విజయం
చౌహాన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విదిషా లోక్‌సభ నియోజకవర్గంలోని బుధ్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లో, 1989 సార్వత్రిక ఎన్నికల నుంచి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పనిచేసిన బిజెపి కార్యకర్త అజబ్ సింగ్ యాదవ్ ఇలా గుర్తుచేసుకున్నారు, "1991లో చౌహాన్ మొదటిసారి విదిశ నుంచి పోటీ చేసినప్పుడు, మామాజీకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇది బీజేపీకి కంచుకోట. వాజ్ పేయ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఆయన పెద్ద నాయకుడు కారు. శర్మ అప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచారు. పైగా బాగా తెలిసిన పేరు. ఓడిపోతాడని అనుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
ఉపఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు, యాదవ్ మాట్లాడుతూ, "మేమంతా ఆశ్చర్యపోయాము" ఎందుకంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, "విదిశ ఉపఎన్నికల ఫలితాలు సాధారణంగా ఏపార్టీకి అనుకూలంగా ఉండాలి. కానీ అనూహ్యంగా చౌహన్ గెలిచారు. అది కూడా 90 వేల తేడాతో. అంతకుముందు వాజ్ పేయ్ లక్ష ఓట్ల తేడాతో గెలిచారు.
“ జబ్ వో కుచ్ నహీ ది టాబ్ ఇంకో ఇత్నీ బురి తరః హరయా థా; అబ్ తో వో రాష్ట్రీయ నేతా హైం.. క్యా హోగా సోచ్ లో.. యహాన్ చునావ్ సిర్ఫ్ జీత్ కి మార్జిన్ కా హై (చౌహాన్ ఎవరూ కానప్పుడు, అతను శర్మను చిత్తుగా ఓడించాడు; ఇప్పుడు చౌహాన్ జాతీయ నాయకుడు, మీరు ఊహించవచ్చు ఎన్నికల ఫలితం.. ఇక్కడ ఎన్నికలు కేవలం చౌహాన్ గెలుపు మార్జిన్‌ని నిర్ణయించడం కోసమే” అని చౌహాన్ క్యాబినెట్‌లోని మాజీ సభ్యుడు. విదిశాలోని భోజ్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే అయిన సురేంద్ర పట్వా ది ఫెడరల్‌తో అన్నారు. 16 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్రాన్ని కమలదళానికి కంచుకోటగా మార్చింది చౌహానే. నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయం వల్ల రాష్ట్ర రాజకీయాల నుంచి బలవంతంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది.
కఠిన యుద్ధంలో కాంగ్రెస్..
“ఇది కఠినమైన సీటు, పరిస్థితులు అనుకూలంగా లేవని నాకు తెలుసు, కానీ పార్టీ విదిశ నుంచి పోటీ చేసే బాధ్యతను నాకు అప్పగించింది. నేను ఈ సవాల్ ను స్వీకరిస్తున్నాను. 1980లో నేను ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు విదిశను కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు కానీ నేను గెలిచాను” అని శర్మ అన్నారు.
1980 లేదా 1991లో నేను వాజ్‌పేయి చేతిలో ఓడిపోయిన నాటి రాజకీయ పరిస్థితులతో 2024 ను పోల్చలేమని శర్మ అంగీకరించారు. అన్నింటిని బీజేపీ హస్తగతం చేసుకుందని ఆరోపించారు. విదిశ వీఐపీ సీటు అయినప్పటికీ అభివృద్ధి పరంగా వెనకబడిందని అన్నారు. నేను ఎంపీగా ఉన్్న సమయంలోనే అభివృద్ధికి బీజం పడిందని పేర్కొన్నారు.
1980- 1989 మధ్య తాను విదిశ ఎంపీగా పనిచేసినప్పుడు, “విద్యుదీకరణ 14 శాతం నుంచి 80 శాతానికి పైగా పెరిగింది, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాం. రోడ్ల మెటల్లింగ్ పనులు మంజూరు చేయబడ్డాయి” అని శర్మ చెప్పారు.
ఇక్కడ నుంచి గెలిచిన బిజెపి నాయకులు, అది వాజ్‌పేయి, సుష్మా స్వరాజ్ లేదా చౌహాన్ కావచ్చు, విదిశను ఎన్నికల్లో గెలవడానికి మార్గంగా చేసుకున్నారు అంతే.. అభివృద్ధి మాత్రం శూన్యమని కాంగ్రెస్ సీనియర్ ఆరోపిస్తున్నారు. చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విదిషా లోని బుద్ని నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, "బుధ్నీలో కూడా ఆశించే అభివృద్ధిని జరగలేదు".
స్థానికులు బీజేపీకి అంకితమయ్యారు..
"భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ వంటి వాటితో పోలిస్తే విదిశా చాలా వెనుకబడి ఉంది" అని కిరాణా దుకాణం యజమాని బసోడా నివాసి రామ్ అవతార్ పటేల్ చెప్పారు, మంచి బైపాస్‌లు నియోజకవర్గాన్ని దాటే హైవేలను మినహాయించి, ఏం లేదు ముఖ్యంగా తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో "మంచి పాఠశాల లేదా కళాశాల లేదు ఆసుపత్రులు లేవు. తీవ్ర నిరుద్యోగం కూడా ఉంది". అయినప్పటికీ, చౌహాన్ "అత్యధిక మార్జిన్‌తో గెలుస్తాడని" రామ్ అవతార్ కచ్చితంగా చెప్పాడు.
Read More
Next Story