‘ తాజ్ మహాల్ అందాన్ని వర్ణించడానికి పదాలు చాలవు’: మెయిజ్జు
x

‘ తాజ్ మహాల్ అందాన్ని వర్ణించడానికి పదాలు చాలవు’: మెయిజ్జు

నాలుగు రోజుల పర్యటనకు భారత దేశానికి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మాద్ మెయిజ్జు ఆగ్రాలోని ప్రఖ్యాత ప్రేమ కట్టడం తాజ్ మహాల్ ను సందర్శించారు. ఆయన తో పాటు..


భారత పర్యటనలో ఉన్నమాల్దీవుల అధ్యక్షుడు మెయిజ్జు, ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ మంగళవారం పాలరాతి ప్రేమ సౌధం తాజ్ మహాల్ ను సందర్శించారు. వారు ఈ కట్టడాన్ని చూసి చాలా సేపు మైమరిచిపోయారు. చాలా సేపు అక్కడ గడిపిన ఈ జంట అక్కడ ఫోటోలు దిగారు.

" ఈ సమాధి అందాన్ని వర్ణించడానికి పదాలు దొరకడం లేదు. వర్ణించడానికి పదాలు న్యాయం చేయలేవని నాకు అనిపిస్తుంది. ఈ మంత్రముగ్ధులను చేసే చిక్కుముడి, ప్రేమ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం" సందర్శకుల పుస్తకంలో ఆయన రాశారు. ఆయన నాలుగు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీకి విచ్చేశారు.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరపున ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ స్వాగతం పలికారు. మహమ్మద్ మొయిజ్జుకు తాజ్ మహాల్ వద్ద ఘనంగా స్వాగత సత్కారాలు లభించాయి. యూపీ మంత్రి వారికి తాజ్ మహాల్ చిత్రం ఉన్న జ్ఙాపికను అందజేశారు. అనంతరం వారు ఫొటోలకు ఫోజులిచ్చారు.
ముయిజు సందర్శన కారణంగా తాజ్ మహల్ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ప్రజల కోసం మూసివేయబడిందని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారి తెలిపారు. ముయిజ్జూ శిల్పగ్రామ్, ఓపెన్ ఎయిర్ క్రాఫ్ట్‌ల గ్రామాన్ని కూడా సందర్శించారు, అక్కడ విమానాశ్రయానికి బయలుదేరే ముందు బ్రజ్ ప్రాంతానికి చెందిన కళాకారుల ప్రదర్శన ద్వారా అతనికి స్వాగతం పలికారు.



Read More
Next Story