
కాశ్మీర్: గరిష్ట నష్టమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు
అమాయక హిందూ టూరిస్టులపై దాడిని బాడీ కెమెరాలు ఉపయోగించిన ఇస్లామిక్ ఉగ్రవాదులు
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడిపై ప్రాథమిక దర్యాప్తులో అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి. మారుమూల ప్రాంతమైన బైసారన్ లో భద్రత లేకపోవడం వల్లే ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారని, గరిష్ట నష్టం కలిగించే స్పష్టమైన లక్ష్యంతో దాడులకు పాల్పడ్డారని పలు మీడియాలు వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి.
26 మంది హిందూవుల ప్రాణాలు తీసిన ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్రవాదులు విస్తృతమైన నిఘా నిర్వహించి, మారుమూల బైసారన్ గడ్డి మైదానాలను ఎంచుకున్నారు.
ఎందుకంటే అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతో ఈ దాడి జరిగిందని, మూలాలను ఉటంకిస్తూ ఇండియా టుడే నివేదిక తెలిపింది.
పహల్గామ్ పట్టణం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ కు కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. దీనివల్ల అత్యవసర సేవలు అందించేవారు త్వరగా చేరుకోవడం కష్టం. ఆ దారుణమైన దాడిని రికార్డు చేయడానికి ఉగ్రవాదులు హెల్మెట్ మౌంటేడ్ బాడీ కెమెరాలను ధరించారని తెలుస్తోంది.
భయానక దృశ్యాలు..
వార్తా నివేదికల ప్రకారం..ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టి పురుషులను వేరు చేసి, వారి గుర్తింపులను నిర్ధారించి, కాల్పులు జరిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఏకే- 47 రైఫిళ్లతో విచణారహితంగా అతి కాల్పులు జరపగా, కొందరిని దూరం నుంచి కాల్చారు. ఇది స్నిపర్ కాల్పుల మాదిరిగానే జరిగింది. సాయం అందకముందే అధిక రక్త నష్టం కారణంగా చాలామంది మరణించారు.
కనీసం ఆరుగురు ఉగ్రవాదులు ఈ హత్యలలో పాల్గొన్నారని, వీరిలో ప్రధానంగా పాకిస్తానీ, కాశ్మీరీ జాతీయులు ఉన్నారని, వారికి స్థానికంగా సాయం చేశారని కొన్ని వర్గాలు మీడియాకు తెలిపాయి.
దాడికి ముందు, ఉగ్రవాదులు దట్టమైన అటవీ ప్రాంతంలో దాక్కునేవారని ఆరోపించారు. స్థానిక ఉగ్రవాదులు, స్లీపర్ ఏజెంట్ల సాయంతో దాడి చేసిన వారు తమ స్థానాన్ని మార్చుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
టీఆర్ఎఫ్ ఎవరూ?
పహల్గామ్ ఊచకోతకు బాధ్యత వహిస్తున్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఏ తోయిబాకి ప్రతినిధిగా 2019 లో ఏర్పడింది. ఇది పాక్ ఉగ్రవాద సంస్థకు ముసుగు సంస్థగా తోడ్పడింది.
జనవరి 2023 హోం వ్యవహరాల మంత్రిత్వశాఖ టీఆర్ఎఫ్ ను చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం కింద ఉగ్రవాద సంస్థగా పేర్కొంది. ఉగ్రవాద ప్రచారం.. ఉగ్రవాదుల నియామకం, చొరబాట్లు, పాకిస్తాన్ నుంచి జమ్మూకాశ్మీర్ ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో దాని ప్రమేయాన్ని పేర్కొంది.
ఆగష్టు 2019 లో ఆర్టికల్ 370 రద్దు తరువాత టీఆర్ఎఫ్ ఆన్ లైన్ ఉగ్రవాద సంస్థగా ఉద్భవించింది. 2019 తరువాత కాశ్మీర్ లో ఇస్లామిక్ పేరును దూరం చేసి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నించింది.
ఇటీవల సంవత్సరాలలో లోయలో అత్యధిక ఉగ్రవాద మరణాలకు టీఆర్ఎఫ్ కారణమని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దాని కమాండర్ షేక్ సజ్జాద్ గుల్ ను యూఏపీఏ లోని నాల్గవ షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించారు.
దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఐఏ..
జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఉగ్రవాద దాడిపై దర్యాప్తును ప్రారంభించింది. ఇది వాంగ్మూలాలను నమోదు చేయడం, ఊచకోత జరిగిన ప్రదేశం నుంచి బుల్లెట్ కేసింగ్ లు, మట్టి నమూనాలతో సహ ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడం ప్రారంభించింది.
ఉగ్రవాదులు స్థానిక స్లీపర్ సెల్స్ తో సమావేశం అయి, రెక్కీ నిర్వహించి దాడులకు పాల్పడుతున్నారని అనుమానాలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థ బైసారన్ సమీపంలోని అనేకమంది వ్యక్తులను కూడా ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ప్రముఖుల సమక్షంలో బాధితులను పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
Next Story