గ్యాంగ్ స్టర్ హత్య కేసులో జేడీ(యూ) నేత అరెస్ట్
x
అనంత్ సింగ్

గ్యాంగ్ స్టర్ హత్య కేసులో జేడీ(యూ) నేత అరెస్ట్

మోకామా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రధాన నిందితుడు అనంత్ సింగ్ భార్య


బీహార్ మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత అనంత్ సింగ్ ను పోలీసులు హత్య చేశారు. జన్ సురాజ్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. ఆయనపై పోలీసులు నిఘా ఉంచారు.

పాట్నా నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ లోని అతని ఇంటి నుంచి పోలీసులు అనంత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన సంఘటన స్థలంలోనే ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ముగ్గురిని మేజిస్ట్రేట్ ముందు హజరుపరుస్తున్నామని పోలీసులు తెలిపారు. గురువారం పాట్నా లోని మోకామాలో జన్ సురాజ్ అభ్యర్థి పార్టీ పియూష్ ప్రియదర్శి తరఫున ప్రచారం చేస్తుండగా యాదవ్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన మోకామా ప్రాంతంలోని భదౌర్, ఘోశ్వరి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది.

ముగ్గురు అక్కడే..
పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ తో కలిసి పాట్నా సీనియర్ పోలీస్ అధికారి కార్తికేయ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘దులార్ చంద్ హత్యకు సంబంధించి పోలీసులు అనంత్ సింగ్, మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్’’ లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం దులార్ చంద్ పై కఠినమైన మొద్దుబారిన పదార్థం ఉపయోగించి చంపారు. దీనివలన బాధితుడి గుండె, ఊపిరితిత్తులకు గాయం కావడంతో షాక్ గురైయ్యాడు. తరువాత కార్డియో శ్వాసకోశ వైఫల్యంతో మరణించాడని పోలీస్ అధికారి తెలిపారు. ఇది హత్య కేసని పోస్ట్ మార్టం తెలియజేసిందని, ఇది జరిగినప్పుడు ముగ్గురు నిందితులు అక్కడే ఉన్నారని విచారణలో తేలినట్లు శర్మ అన్నారు.
‘‘యాదవ్ హత్య కేసులో పోలీసు దర్యాప్తులో భాగంగా వారిని అరెస్ట్ చేశాం. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి మొత్తం నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాం. వాటిలో ఒకటి ఈసీకి సంబంధించి మోడల్ ప్రవర్తన నియామవళి ఉల్లంఘనది ఉంది’’ అని ఎస్ఎస్పీ తెలిపారు. ఇందులో అనంత్ సింగ్ పేరు కూడా ఉందని వెల్లడించారు.
ప్రవర్తన నియామళి ఉల్లంఘన..
ప్రస్తుతం అనంత్ సింగ్ భార్య నీలందేవీ మోకామా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెపై కూడా ఈసీ నిబంధనల ఉల్లంఘనపై కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో అనుచరులతో అనంత్ సింగ్ పాట్నా వీధుల్లో హల్ చల్ చేయడం కనిపిస్తోంది.
యాదవ్ కు తన మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరిగినట్లు ఆయన ఆరోపించారు. కానీ ఈ హత్య తాను చేయలేదని, అండర్ వరల్డ్ స్థానిక రాజకీయాల్లో తన పాత ప్రత్యర్థి సూరజ్ భాన్ పై ఆరోపణలు చేశారు. ఆయన భార్య వీణాదేవీ ఆర్జేడీ టికెట్ పై ఈ సీట్ కు పోటీ చేస్తున్నారు.
1990 లలో యాదవ్ భయంకరమైన గ్యాంగ్ స్టర్. అతనికి అనంత్ సింగ్ కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ నుంచి రాజకీయ నాయకుడు ప్రియదర్శి పియూశ్ కు దులార్ చంద్ మద్దతు ఇస్తున్నాడు.
అధికారులపై చర్యలు..
ఈ హత్యకు సంబంధించి మోకామాలో హింస జరిగింది. దీనిని ఎన్నికల సంఘం సీరియస్ గా పరిగణించింది. పాట్నా పోలీస్ సూపరింటెండెంట్(గ్రామీణ) బదిలీ చేసింది. మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మోకామా అసెంబ్లీ స్థానానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్న బార్హ్ సబ్ డివిజనల్ అధికారి, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బార్హ్ -1, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బార్హ్-2 స్థానంలో కొత్త అధికారులను నియమించాలని ఆదేశించింది.
ఈ ముగ్గురిపై క్రమ శిక్షణా చర్యలు ఆదేశిస్తునే పోలీస్ అధికారి అభిశేక్ సింగ్ ను సస్పెండ్ చేయాలని కూడా పేర్కొంది. బీహార్ నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


Read More
Next Story